'నిజం గెలవాలి' యాత్రలో నారా భువనేశ్వరికి బ్రహ్మరథం.

'నిజం గెలవాలి' యాత్రలో నారా భువనేశ్వరికి బ్రహ్మరథం.

*రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోవాలంటే మళ్ళీ సీఎం చంద్రబాబు కావాలి.

*వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా ఎగరవేయండి.

*పసుపు సైనికులంతా స్పీడును పెంచాలి.

 జనం న్యూస్ 5 ఏప్రిల్ 2024 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా :మండలంలోని నారాయణపురం గ్రామంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపం చెంది మరణించిన వారి కేశినేని వెంకటేశ్వర్లు, కందుకూరి నరసింహాచారి, నారాయణ కుటుంబాలను నిజం గెలవాలి పేరుతో  కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అరాచక జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే యువతకు భవిష్యత్తు ఉండదని, రాష్ట్రం రావణ కాస్టంల మారుతుందని అన్నారు. వైసీపీ రాక్షస పాలనలో టిడిపి కార్యకర్తలను చంపడం,హింసించడం, ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు.ఒక కుటుంబానికి తండ్రి ఎంత ముఖ్యమో రాష్ట్రానికి మంచి నాయకులు అంత అవసరంఅని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించారు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తెచ్చిన కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరలించారని, అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు పేదవాళ్లకు కూడు, గూడు,గుడ్డ  అందించాలనే లక్ష్యంతో పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు పేదవారు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను  ప్రారంభించారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లను అడ్డగోలుగా మూసేసి పేదవాళ్ల పొట్ట కొట్టారని అన్నారు. మూడు రాజధానులు కడతామని చెప్పిన వైసిపి ప్రభుత్వం ఈ దేశంలోనే ఏపీని రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలబెట్టారన్నారు. ఏపీ ప్రజలు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిని తీసుకొచ్చిందన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు అన్న ఎన్టీఆర్ తెలుగంగ ప్రాజెక్టును నిర్మించారని  అన్నారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రాత్రింబవళ్ళుకష్టపడ్డారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. పసుపు సైనికులంతా సైకిల్ స్పీడును పెంచాలి అడ్డొచ్చిన దుర్మార్గులను తొక్కుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. కురుక్షేత్రంలో పసుపు జెండాను ఎగరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గంమాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,శబరి, మల్లెల రాజశేఖర్,నందిపాటి నరసింహారెడ్డి, కంచర్ల సురేష్ రెడ్డి,కంచర్ల మనోహర్ రెడ్డి,తాటికొండ బుగ్గ రాముడు, మాజీ సర్పంచ్ షేక్ బాబు, సర్పంచ్ రామచంద్రుడు, వెంగల్ రెడ్డి  పేట శ్రీనివాసులు,పాల శంకర్, వెంకటసుబ్బయ్య గౌడ్, జాకీర్ ఖాన్, మల్లేశ్వర్ రెడ్డి, సిద్దయ్య, భరద్వాజ్ శర్మ, నారాయణ,మండల టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.