ఊరి వీధుల్లోకి వచ్చిన సింహం... సింహాన్ని పరుగులు పెట్టించిన కుక్కలు ( వీడియో చూడండి)

ఊరి వీధుల్లోకి వచ్చిన సింహం... సింహాన్ని పరుగులు పెట్టించిన కుక్కలు ( వీడియో చూడండి)

జనం న్యూస్: గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల్లో సింహాలు సంచరించడం చాలా కామన్. మనుషుల మధ్యే నిరంతరం తిరుగుతుంటాయి. రాత్రి అయితే చాలు గుంపులు గుంపులుగా గ్రామాల్లో వీధుల వెంట తిరుగుతూ హల్ చల్ చేస్తుంటాయి సింహాలు. ఈ క్రమంలోనే కొన్ని సింహాలు ఓ గ్రామంలో రాత్రివేళ సంచరిస్తున్నాయి. ఇంతలో ఓ మగ సింహం ఒంటరిగా వీధుల్లో తిరుగుతోంది. దీనిని గమనించిన కుక్కలు.. అంతెత్తు లేచాయి. సింహంపై అరిచాయి. వీధి కుక్కలన్నీ గుంపుగా ఏర్పడి.. ఆ సింహం వెంటపడ్డాయి. కుక్కల దెబ్బకు హడలిపోయిన సింహం.. వీధుల్లో పరుగులు తీస్తూ పరుగులు తీసింది. ఈ ఘటనను గ్రామస్తులు కొందరు సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. సింహాన్ని కొన్ని కుక్కలు ఉరికించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అడవి రాజును వణికించిన గ్రామ సింహాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ వైరల్ వీడియో మీరూ ఓ లుక్కేసుకోండి. 

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి

https://twitter.com/susantananda3/status/1638572072526913537?s=20