కాట్రేనికోన లో హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో.. శ్రీ రామ నామ పుర సంకీర్తన

కాట్రేనికోన లో  హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో.. శ్రీ రామ నామ పుర సంకీర్తన

జనం న్యూస్ జనవరి 22 కాట్రియను కొన  ఈరోజు అయోధ్య లో బాల రామ ప్రతిష్ట సందర్భంగా.. కాట్రేనికోన లో హ్యాపీ క్లబ్ వ్యవస్థాపకులు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి గారి, ఆధ్వర్యంలో.. కాట్రేనికోన గ్రామ ప్రజల సహకారం తో ఉ. 05.00 నుంచి ఉ. 7.00 వరకు శ్రీ రామ నామ పుర సంకీర్తనా కార్యక్రమం.. నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ మావూళ్ళమ్మ తల్లి ఆలయం దగ్గర నుంచి ప్రారంభమైంది. రామ నామ సంకీర్తన అనంతరం రాజుల వీధి కోదండ రామాలయంలో పండితుల సమక్షంలో.. శ్రీ సూక్తం, పురుష సూక్తం పారాయణ జరిగింది. ఈ గ్రామ సంకీర్తన లో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ ఆణివిళ్ళ ఫణికాంత్ శర్మ, ఆణివిళ్ళ సాయిబాబా, ఆణివిళ్ళ శేషసాయి, తాతపూడి లక్ష్మీ నారాయణ మూర్తి, ఆకొండి సాయి కిరణ్ శర్మ, కొత్తగుండు భాస్కర రావు, కోట ఉమామహేశ్వర రావు, గ్రంథి నానాజీ, తాతపూడి గోపీ, మంగళంపల్లి శర్మ, మంత్రిప్రగడ శ్రీనివాస్, పెద్దింటి వ్యాస మూర్తి, ఏ. కృష్ణ భవానీ తాతపూడి పద్మ, ఆణివిళ్ళ లక్ష్మీ కౌండన్య, ఆకొండి లీల, గ్రంథి వేంకట లక్ష్మీ, గ్రంథి దేవి, చెరుకు రామకృష్ణ, చెరుకు రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.