*పురాతన భక్తాంజనేయ స్వామి ఆలయంలో*

*పురాతన భక్తాంజనేయ స్వామి ఆలయంలో*

 *శ్రీరామ కీర్తన, రామ కోటి రచన* 

 *అయోధ్య ఆలయ ప్రతిష్ట దృశ్య శ్రావణం* 

 *మహా అన్నదానం* 

 జనం న్యూస్ ప్రతినిధి రాయికల్ పట్టణం జనవరి22. 

రాయికల్ పట్టణంలో ప్రాచీన బద్దాల పురం(పద్మ దేవి పురం)

శ్రీశ్రీ పురాతన భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో త్రయంబకేశ్వర శివలింగం హనుమాన్ విగ్రహాలు గత సంవత్సరం క్రితం బయటపడడంతో ఆలయ కమిటీ మరియు వందేమాతరం యూత్ సభ్యులు పూజలు నిర్వహిస్తుంటారు హిందువుల చిరకాల వాంఛ 500 సంవత్సరాల పోరాటం అనంతరం అయోధ్య రామ మందిరంలో బాల రామ విగ్రహ ప్రతిష్ట అయిన విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని 

ఆలయంలో 

బ్రహ్మనోత్తాములచే ప్రత్యేక పూజలు జరుగగా వేలాది తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు ప్రాంగణంలో భక్తులచే 

శ్రీరామ కోటి రచనలు భక్తులచే

 రామ కీర్తన పారాయణం తో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది అనంతరం

 అయోధ్య ఆలయ ప్రతిష్ట లైవ్(దృశ్య శ్రావణం) 

ను భక్తులు ఆసక్తిగా తిలకించారు అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనలు 

ఆకట్టుకున్నాయి మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సామల సతీష్, చింతకుంట సాయికుమార్, చింత రాజేష్, వాసం జలంధర్, ధర్మా జాగరణ సమితి కార్య వీబాగ్ సురేందర్,

వందే మాతరం యూత్ సభ్యులు వాసాల రాంప్రసాద్,చింతకుంట రాజేష్,నాగరాజ్,ప్రశాంత్,గౌతమ్,రాజు,తేజ,అంజి,మారుతి,రంజిత్,ప్రవీణ్ బాలు,వినోద్,మనోజ్,శశి, మనో,సురేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.