గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 15సం.లు జైలు, ఒక్కొక్కరికి రూ.1లక్ష జరిమానా* *

గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 15సం.లు జైలు, ఒక్కొక్కరికి రూ.1లక్ష జరిమానా* *

*- విజయనగరం రూరల్ సిఐ టివి తిరుపతిరావు*

జనం న్యూస్,జనవరి 11

విజయనగరంఐదు

విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో 2018లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు

15సం.లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం 1వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్

జడ్జి జి. రజని గారు జనవరి 10న తీర్పు వెల్లడించారని విజయనగరం రూరల్ సిఐ టివి తిరుపతిరావు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం రూరల్ పోలీసు స్టేషను పరిధిలోని రాకోడు - పినవేమలి గ్రామాల మద్య

విజయనగరం రూరల్ పోలీసులకు రాబడిన సమాచారంతో తే. 19-02-2018 దిన అప్పటి రూరల్ ఎస్ఐ

పి.రామకృష్ణ వాహన తనిఖీలు చేపట్టగా, గంట్యాడ మండలం నవర గ్రామం ఎ.ఎం.జి. కాలనీకి చెందిన చలుమూరి

గంగునాయుడు (46 సం.లు) మరియు విజయనగరం పట్టణంకు చెందిన పెసల శాంసన్ (47 సం.లు) అనే ఇద్దరు

వ్యక్తులు రెండు వేరువేరు మోటారు సైకిళ్ళుపై నరవ గ్రామం నుండి వస్తూ, పోలీసులకు పట్టుబడగా, వారిద్దరి నుండి

65 కిలోల గంజాయిని అప్పటి తాశీల్దారు సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకోగా, అప్పటి విజయనగరం రూరల్

సిఐ డి. లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితులకు అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, నిందితులపై అభియోగ

పత్రం దాఖలు చేసారు.

జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం. దీపిక, ఐపిఎస్ గారి ఆదేశాలతో ప్రస్తుత రూరల్ సిఐ టివి తిరుపతిరావు ఈ కేసును

ప్రాధాన్యత కేసుగా స్వీకరించి, కోర్టు విచారణలో సాక్షులను ప్రవేశపెట్టి, సాక్ష్యం చెప్పే విధంగా ప్రత్యేక శ్రద్ధవహించడం

తో నిందితులపై నేరారోపణలు రుజువుకావడంతో 1వ 1వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి జి. రజని గారు

నిందితులకు 15సం.లు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1లక్ష జరిమాన విధించారు. నిందితులు జరిమాన చెల్లించడంతో

విఫలమైతే ఆరు మాసాలు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రస్తుత విజయ

నగరం రూరల్ సిఐ టివి తిరుపతిరావు, ఎస్ఐ గణేష్, కోర్టు కానిస్టేబులు లక్ష్మి నిందితులను శిక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ

కనబర్చగా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు బి.రవి పోలీసు వారి తరుపున వాదనలు వినిపించారు.