గురజాడ పాఠశాల'లో ఘనంగా "సంక్రాంతి సంబరాలు

గురజాడ పాఠశాల'లో ఘనంగా "సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్,జనవరి 09 

విజయనగరంఐదు

సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురజాడ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను పాఠశాల కరస్పాండెంట్ ఎం. స్వరూప సోమవారం ఘనంగా నిర్వహించారు. 

ఈ సంక్రాంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా గురజాడ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.వి.అర్. కృష్ణాజి,ప్రముఖ వైద్యులు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్,విశిష్ఠ అతిధులుగా కార్పొరేటర్ ప్రభాకర్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇటువంటి ఉత్సవాలు చేయటం ద్వారా విద్యార్థినీ విద్యార్థుల్లో సంస్కృతీ సంప్రదాయాలు అవగాహన కలుగుతుందని,విద్యతో పాటు ఇటువంటి విలువలతో కూడిన కార్యక్రమాలు చేయటంలో గురజాడ పాఠశాల ఎల్లప్పుడూ ముందుంటుందని గురజాడ పాఠశాలలో విద్యార్థులకోసం చేపడుతున్న సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో భాగంగా భోగి మంట,సంక్రాంతి ముగ్గులు , సంక్రాంతి అలంకరణలు, హరిదాసు గానం, గంగిరెద్దులు, కోలాటం , కూచిపూడి,భరత నాట్యం, రైతు వేషధారణలచే ఉదయం సాయింత్రం వరకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగాయి. 

విద్యార్థినీ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లులతో ముగ్గులపోటీలను నిర్వహించిన కార్యక్రమం అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ముఖ్య అతిధిలుచే అందించారు.

ప్రముఖ రచియిత జక్కు రామకృష్ణ వ్యాఖ్యాతగా నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూడి శేఖర్, పాఠశాల ఎ.ఓ. నాయుడు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.