చిన్నారుల ప్రాణాలతో చాలగటం అడుతున్న కార బిస్కెట్

చిన్నారుల ప్రాణాలతో చాలగటం అడుతున్న కార బిస్కెట్

 ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పరిశ్రమ

- కనీస నిబంధనలు పాటించాన్ని వైనం

- వెయ్యి ఇస్తే పురపాలక సంఘం అధికారులు ఇక్కడకురారు
 
- గతంలో జైలుకు వెళ్లిన తీరు మార్చుకొని అరవింద్ గుప్త

సబ్జెక్ట్ జనం న్యూస్/ సెప్టెంబర్16/మేడ్చల్ మండలం మేడ్చల్&మల్కాజ్గిరి జిల్లాచిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గుప్తా బేకర్స్ పై చర్యలు తీసుకోవాల్సిన పుడ్ సేఫ్టీ అధికారులు, మేడ్చల్  పురపాలక సంఘం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేకున్నా కనీస నియమ నిబంధనలు పాటించకున్నా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి వద్దకు స్థానిక పురపాలక సంఘం అధికారులు వచ్చి  వెయ్యి రూపాయలు, పావు కిలో కారా బిస్కెట్ ఇస్తే మరో వారం వరకు  కన్నెత్తి చూడారని  గుప్తా గుప్తా బేకర్స్ యజమాని అరవింద్ గుప్తా చెప్పడం విడ్డూరంగా ఉందిఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పరిశ్రమ :ఒక సంస్థ నిర్మించడానికి కానీ, ఒక పరిశ్రమ నిర్మించడానికికానీ సదర్ పరిశ్రమకు సంబంధించి ఉన్నతాధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.  గుప్తా బేకర్స్  యజమాని అరవింద్ గుప్తా ఇలాంటివి వాటి  వ్యాలిడిటీ పూర్తయిన  సరైన పత్రాలకు అనుమతి తీసుకోకుండా  నిర్లక్ష్యం వహించడమే కాకుండా సంబంధిత పత్రాలను పరిశీలించడంలో  నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు   మామూలు మత్తుల మోజులో పడి సదరు పరిశ్రమపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించాన్ని వైనం : కారా బిస్కెట్ తయారీ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు విషయంలో ఒంటిపై బట్టలు లేకుండా బిస్కెట్లు తయారు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరెంటు పోయిన సమయంలో మీరు పెట్టే జనరేటర్ సౌండ్ కి వీధిలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు తెలిపారు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రుచి కోసం రసాయన పదార్థాలను వాడుతున్న యజమాన్యం  తంలో జైలుకు వెళ్లిన తీరు మార్చుకొని అరవింద్ గుప్త :గత సంవత్సర కాలంలో గుప్తా బేకర్స్ యజమాని అరవింద్ గుప్తాను పోలీసులు రైడ్ చేసి జైలుకు పంపి కోర్టులో హాజరుపరచినట్లుగా గుప్త తెలిపారు జరిమానా కట్టి బయటకు వచ్చిన అరవింద్ గుప్తా తన తీరు మార్చుకోకుండా యధావిధి తథాస్థితి అన్న విధంగా అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు వెంటనే స్పందించి సదరు పరిశ్రమ యజమానిపై పురపాలక సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.