జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులకి సన్మానం

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులకి సన్మానం

జనం న్యూస్,జనవరి 13 

విజయనగరంఐదు

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అత్యధికంగా బ్లడ్ డొనేషన్ చేసిన వారికి, అత్యధికంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేసిన చేసిన మోటివేటర్స్ కి విజయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి

 ముఖ్యఅతిథిగా విచ్చేసిన సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ శ్రీరామ్ మూర్తి చేతుల మీదుగా తమవంతు కృషి చేస్తున్న యువతి యువతలకు సన్మాన కార్యక్రమం చేశారు. విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ .ఇల్తామాష్ అత్యధికంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడమే కాకుండా తాను కూడా 34 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం గొప్ప విషయం అని డాక్టర్ శ్రీరామమూర్తి కొనియాడారు.... యువత మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో యువత నడుచుకోవాలని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ శివ పుణ్యమంతుల మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం కోసం అహర్నిశల కష్టపడుతున్న విజయనగరం యూత్ ఫౌండేషన్ వారు అనేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ చైర్మన్ షేక్. ఇల్తామాష్ మాట్లాడుతూ యువత రక్తదానానికి ముందుకు రావాలి అని మీరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుందని తెలియజేశారు డాక్టర్ శ్రీరామ్ మూర్తి చేతులపై ఈ సన్మానం జరగడం ఆనందంగా ఉంది అన్నారు విజయనగరం యూత్ ఫౌండేషన్ టీం సభ్యులందరికీ సన్మానం చేయడం గొప్ప విషయం అని తెలియజేశారు ,విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శివ పుణ్యమంతుల ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇంకా రానున్న రోజుల్లో విజయనగర పట్టణ ప్రజలకు మంచి మంచి సేవ కార్యక్రమాలు చేస్తూ విజయనగరం యూత్ ఫౌండేషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు అశోక్, సాయి ,రాయల్ క్యాబ్స్ శరత్, రాము, రఘు, తదితరులు పాల్గొన్నారు