బదిలీపై వెళ్తున్న ఎస్ఐలకు సత్కారం

బదిలీపై వెళ్తున్న ఎస్ఐలకు సత్కారం

జనం న్యూస్. జనవరి. 13. విజయనగరం జిల్లా. రాజాం.

శుక్రవారం సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్ లో బదిలీపై వెళ్తున్న ఎస్సైలకు సర్కిల్ ఇన్స్పెక్టర్. కే రవికుమార్ స్టేషన్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. రాజాం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె .రవికుమార్ మాట్లాడుతూ సేవ చేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, ఉద్యోగులకు చేసిన సేవలకు సమాజ, తోటి ఉద్యోగుల నుండి గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఎస్సీలు పి.నీలవతి, వి. బి రామకృష్ణరావు తోటి సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కిరణ్ కుమార్, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...