దళిత ద్రోహులకు అండగా జనగామ ఎమ్మెల్యే

దళిత ద్రోహులకు అండగా జనగామ ఎమ్మెల్యే

 జనం న్యూస్ జనవరి 10( సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి విజయ్ కుమార్ )

 సిద్దిపేట్ జిల్లా దూల్మిట్ట గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన, దళిత బంధు పథకం పేరుతో, ఉమ్మడి మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో దళితుల వద్ద రూపాయలు వసూలు చేసిన వారికి, జనగామ ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారనీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దల మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు, దళిత జనోర్ధారణ, సామాజిక లక్ష్యంతో ఆర్థిక అభిృద్ధినీ దళిత వర్గాల్లో తీసుకురావాలని, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చెప్పారని, కానీ దానికి విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే బలంతో, అధికార పార్టీ పేరుతో వసూలు చేసిన సంగతి, నేటి ఎమ్మెల్యేకు తెలిసి కూడా నేడు బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ను కల్పించడంలో, ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు, ఎమ్మెల్యే గారు దళితుల పక్షాన నిలబడతారని ఆశించాం. కానీ ద్రోహుల పక్షనా నిలబడతారనేది తెలుసుకోలేకపోతున్నాము. దళితుల చెమటతో రక్త మాంసాలను పిండి చేసి సంపాదించిన సొమ్మును, అలాగే కొంత మంది భార్యల పుస్తెలతాడు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారని, తెలిసి కూడా వారి పక్షాన నిలబడి డబ్బులు ఇవ్వాల్సింది పోయి, దళితులకు అన్యాయం చేసిన వారిపై అండగా నిలబడటం ఎందుకో తెలియడం లేదు. కావున ఇక్కడి దళితులతో పాటు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే పని విధానాన్ని పరిశీలిస్తున్నారని, ఎవరి పక్షాన నిలబడుతున్నారో, ప్రజలు గమనిస్తున్నారని, తెలిపారు. ఈ కార్యక్రమములో పర్డి కనకరాములు, తూషలపురం రాజు, చెన్నోజు రాజు, బ్రహ్మము, రమేష్, సిద్దులు రాజు, రాజయ్య,తదితరులు పాల్గొన్నారు