నడి రోడ్డుపై వెంటపడి మరీ ఈ మహిళను ఇతను ఎం చేస్తున్నాడో మీరే చూడండి..! ( వైరల్ వీడియో)

నడి రోడ్డుపై వెంటపడి మరీ ఈ మహిళను ఇతను ఎం చేస్తున్నాడో మీరే చూడండి..! ( వైరల్ వీడియో)

జనం న్యూస్: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులతో సామాన్యుడు చతికిల పడుతున్నాడు. వచ్చే జీతం చాలీ చాలక సతమౌతున్నాడు. ఉప్పు, పప్పు ధరలే కాదూ ఇంటి అవసరాల నుండి ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదై కూర్చుంది. ఇక పిల్లల చదువులు మరో ఎత్తు. పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే అప్పులు చేయాల్పిన పరిస్థితి. మొత్తం సంపాదన వీటికే ఖర్చు అయిపోతుంది. ఇలా జీతాలు రావడం అలా ఇంటి అద్దెలు, ఇఎంఐలు, అవసరాలు, ఇతరత్రా ఖర్చులు అయిపోతున్నాయి. ఇక దాచేందుకు ఏమీ మిగలడం లేదు. ఒక ఉద్యోగం చేస్తూనే.. పార్ట్ టైమ్ ఉద్యోగాల వైపు చూస్తున్నాడు. అంతేకాకుండా ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టమౌతుండటంతో, భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు భార్య సైతం ఉద్యోగాలు చేస్తున్నారు. భర్తకు వస్తున్న జీతం చాలకపోవడంతో అతడికి అండగా ఉండాలని భావించిందో భార్య. అది నచ్చని మామ కోడలిపై దాడి చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వాయవ్య ఢిల్లీకి చెందిన కాజల్, ప్రవీణ్ కుమార్ భార్యా భర్తలు. ప్రవీణ్ తన అమ్మనాన్నలతో జీవిస్తున్నాడు. అయితే ప్రవీణ్ ఒక్కడే సంపాదిస్తుండగా.. ఇంటిల్లిపాదీ తిని కూర్చునేవారు. ప్రవీణ్ ఒక్కడే కష్టపడుతుండటాన్ని చూసిన భార్య కాజల్.. అతడికి అండగా నిలవాలని భావించింది. తాను ఉద్యోగం చేస్తానని ఇంట్లో వారికి చెప్పింది. అయితే ఈ విషయం మామకు నచ్చలేదు. ఉద్యోగం చేయోద్దని చెప్పినా కాజల్ వినిపించుకోకుండా తన ప్రయత్నాలు చేయసాగింది. ఇంటర్వ్యూ కోసం కాజల్ బయలు దేరగా.. గమనించిన మామ.. రోడ్డుపైనే ఆమెపై దాడి చేశాడు. ఇటుక రాయి తీసుకుని బలంగా ఆమె తలపై కొట్టాడు. కాజల్ తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. వెంట పడి మరీ కొట్టాడు. ఈ ఘటనలో కాజల్ తీవ్రంగా గాయపడింది.ఈ ఘటన మార్చి 14న జరగ్గా… ఈ ఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్ సోషల్ మీడియాలో షేర్ కావడంతో ప్రస్తుతం వైరల్ వార్తగా మారింది. జాబ్ ఇంటర్వ్యూ కోసం ప్రేమ్ నగర్‌లో నడుచుకుంటూ కాజల్ వెళుతుండగా..మామ ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ.. వెంట తెచ్చిన ఇటుక రాయితో తలపై మోదాడు. దీంతో షాక్ తిన్న ఆమె పరుగులు పెట్టింది. అయినప్పటికీ వదలకుండా ఆమెను వెంబడించి మరీ పలుమార్లు తలపై ఇటుక రాయితో కొట్టినట్లు సిసిటివి ఫుటేజ్‌లో కనిపిస్తుంది. స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన కాజల్‌ను భర్త ప్రవీణ్‌ కుమార్‌, సంజయ్‌ గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా తలపై 17 కుట్లు పడ్డాయి. మరోవైపు కాజల్‌ మామపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి 

https://twitter.com/AnalysisNpa/status/1636258530960478210?s=20