ఘోర రోడ్డు ప్రమాదం నుజ్జు నుజ్జు అయిపోయిన ఇద్దరు మహిళలు.. ! ( వైరల్ వీడియో)

ఘోర రోడ్డు ప్రమాదం నుజ్జు నుజ్జు అయిపోయిన ఇద్దరు మహిళలు.. ! ( వైరల్ వీడియో)

జనం న్యూస్: ఈమధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం లాంటివి ఈ ప్రమాదాలకు కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. తాజాగా శంషాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలమాకుల దగ్గర ఒక లారీ చేసిన బీభత్సంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. ఈ యాక్సిడెంట్​లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మధ్యలో ఉన్న మొక్కలను కత్తిరిస్తున్న మహిళా కూలీలను ఓ లారీ ఢీకొట్టింది. కూలీలు పని చేస్తున్న ప్రాంతంలో సూచిక బోర్డులు కూడా పెట్టారు. వాటితో పాటు అక్కడ ఒక ట్రాక్టర్ కూడా నిలిపి ఉంచారు. కూలీలు మొక్కలు కత్తిరిస్తున్న ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఉన్నా, అక్కడో ట్రాక్టర్ పార్క్ చేసి ఉన్నా వాటిని గమనించని ఒక లారీ డ్రైవర్.. అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. చాలా దూరం ట్రాక్టర్​ను, దాని ట్రాలీతో పాటు లారీ లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలవ్వడంతో వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.