నాలుగేళ్లకు ముందు.ఇదే రోజు పాండమిక్!.

నాలుగేళ్లకు ముందు.ఇదే రోజు పాండమిక్!.

జనం న్యూస్ 12 మార్చి 2024  : 

సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున..కోవిడ్ 19 ను
ప్రపంచ ఆరోగ్య సంస్థ 
పాండమిగ్గా ప్రకటించింది..!
      
నిజానికి అప్పటికే ఆలస్యం జరిగింది..హూ మీద ప్రపంచ దేశాల్లో కొన్ని దుమ్మెత్తిపోసాయి. 

మహమ్మారి గోల ఇప్పుడు లేదన్న మాట వాస్తవమే అయినా ఇంకా అక్కడక్కడ ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంది.కరోనా అనే వైరస్ ప్రపంచాన్ని ఎన్నోసార్లు మోసం చేసిందని..ప్రతిసారి
తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోందని గుర్తు చేస్తున్నారు.ఈసారైతే ఇక రాదనే ఆశలు మరింత బలంగా విస్తరించి ఉన్నాయి..మహమ్మారి బలహీనపడిందన్నది వాస్తవం.వచ్చినా మామూలు వైరస్ అంతే..అయితే దాని తదనంతర ప్రభావం ప్రపంచాన్ని ఊపుతోంది.అకాల మరణాలు పెరిగాయి.

అమ్మబాబోయ్  ఆ రోజులు..
లాక్డౌన్..ఒంటరితనం..
ఇంట్లో రోజుల తరబడి బందీలుగా ఉన్న అనుభవాలు..ఏ రోజున ఎక్కడి నుంచి ఎలాంటి కబురు వినాల్సి వస్తుందోనన్న భయం..
సొంత మనుషులు ఆస్పత్రిలో ఉన్నా..పోయినా కూడా వెళ్లి చూడలేని విచిత్ర పరిస్థితులు..విముక్తి ఎప్పుడా అని ఎదురుచూపులు..
వాక్సిన్ కోసం పడిగాపులు..
అదో నరకం..!
       
కోవిడ్ కారణంగా వివిధ దశల్లో పలు దేశాల్లో మరణించిన వారి సంఖ్య అంచనాలకు మించి ఉంది. ఇక ఇతరత్రా చూస్తే అనేక దేశాల ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి..కొన్ని దేశాలు..సంస్థల పరిస్థితి పూర్తిగా తల్లక్రిందులు అయిపోయింది కూడా.
ప్రపంచం మరోసారి అలాంటి విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు.
అటువంటప్పుడు 
ఆ పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడడమే అవశ్యం..ప్రపంచ దేశాల అధినేతలు..
సంబంధిత సంస్థలు..
మేధావులు..నిపుణులు 
ఆ దిశగా ఆలోచన చేయడం 
మంచిది..
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా