పబ్లిక్ లో ఇవేం పాడు పనులు రా... దీనిని ప్రేమ అనరు కామం అంటారు..! ( వీడియో చూడండి)

పబ్లిక్ లో ఇవేం పాడు పనులు రా... దీనిని ప్రేమ అనరు కామం అంటారు..! ( వీడియో చూడండి)

జనం న్యూస్: ఒకప్పుడు ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పడానికే భయపడేవారు. ఇప్పుడు ఏకంగా తమ ప్రేమను సోషల్ మీడియాలోనే వ్యక్తపరిచేస్తున్నారు. అక్కడితో ఆగకుండా తమ ప్రేమ ఎంత మొహంతో, కామంతో ఉన్నదో అనేది చాటిచెప్పేలా బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. మెట్రో రైలు వీరి కోరికలు నెరవేర్చుకోడానికే నిర్మించినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక ఇద్దరు ప్రేమికులు మెట్రో రైలులో ప్రయాణికులు ఉండగానే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఎక్కువ మంది ట్రెండ్ ని ఫాలో అయితే.. చాలా తక్కువ మంది ట్రెండ్ సెట్ చేస్తుంటారు. అయితే కొందరు ట్రెండ్ సెట్ చేయాలన్న ఆతురతలో ఒళ్ళు మర్చిపోయి.. చుట్టూ పరిసరాలు మరిచిపోయి మరీ ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులతో రెచ్చిపోతున్నారు. పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకుని మరీ హద్దులు దాటేస్తున్నారు. విదేశాల్లో అంటే ఇలాంటి విచ్చలవిడి విన్యాసాలకు అనుమతి ఉంటుంది. అక్కడ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. కానీ భారత్ లో అలా కాదు. ఇక్కడ కొన్నిటికి లోబడి ఉండాలి. సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అసభ్యకరమైన, అశ్లీల చిత్రాలను పెడితే లైకులు కొట్టే నెటిజన్స్ ఉన్నట్టే.. వ్యతిరేకించే వారు కూడా ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి వ్యతిరేకతే మొదలయ్యింది. మెట్రో రైలులో ఇద్దరు లవర్స్ ఒకరినొకరు గట్టిగా కౌగలించుకుని.. అదర చుంబనాలతో రెచ్చిపోయారు. ఆ కోచ్ లో ప్రయాణికులు ఉన్నా కూడా పట్టించుకోకుండా ముద్దులతో రెచ్చిపోయారు. అమ్మాయి కూడా అడ్డు చెప్పకుండా లిప్పుని లాక్ చేసేసింది. అక్కడితో ఆగారా అంటే లేదు. ఆ ముద్దు సన్నివేశాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముద్దు పెట్టుకోవడం కోసమే మెట్రో రైలు ఎక్కినట్టు ఉంది వాళ్ళ తీరు చూస్తే. ఇదొక్కటే కాదు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ మధ్య ఒక యువకుడు మరీ దారుణంగా టవల్ మీద మెట్రో రైలు ఎక్కాడు. ఇటీవల ఒక యువతి బికినీ వేసుకుని మరీ మెట్రో రైలు ఎక్కింది. మెట్రో రైలు అంటే కోరికలు తీర్చుకోవడానికి, ఇష్టమొచ్చిన డ్రస్ లు వేసుకోవడానికి ఉందా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఢిల్లీ మెట్రో రైలులో ఇలాంటి ఘటనలు మామూలైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో అన్నీ అయిపోయాయి, ఇక పాప్ కార్న్ సన్నివేశాలే మిగిలాయని అంటున్నారు. ఇలా యువకులంతా బహిరంగంగా రెచ్చిపోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని, తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి వారి విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి యువతీ, యువకులు బహిరంగ ప్రదేశాల్లో ఇలా హద్దులు దాటి ప్రవర్తించడం పట్ల మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి.

https://twitter.com/HasnaZarooriHai/status/1642792724112842752?s=20