దొంగ దంపతులు.. భలే దొంగలు సినిమా స్టైల్లో దొంగతనం చేసిన జంట.. (వీడియో చూడండి)

దొంగ దంపతులు.. భలే దొంగలు సినిమా స్టైల్లో దొంగతనం చేసిన జంట.. (వీడియో చూడండి)

జనం న్యూస్: నల్గొండ జిల్లాలో భలే దొంగలు సినిమా సీన్ రిపీట్ అయింది. ఆ సినిమాలో తరుణ్, ఇలియానా దొంగతనం చేసినట్లే .. నల్గొండలోనూ లవర్స్ చోరీకి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తూ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. ఈసీన్ చూసిన స్థానికులు వెంబడించడంతో హైస్పీడ్‌తో పరార్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. వాస్తవానికి ఈ కేసు నల్గొండ జిల్లా మర్రిగూడలో చైన్స్ స్నాచింగ్ కేస్ సంబంధించిన నిందితులు పోలీసులకు చిక్కారు. అయితే విచారణలో వారిద్దరూ లవర్స్ కాదని భార్యాభర్తలని గుర్తించారు పోలీసులు. నిందితుడిని హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ గా గుర్తించారు. వీరు దొం*గి*లించిన చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి మార్చుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరు సునీత అనే మహిళను లిప్ట్ ఇస్తామని చెప్పి స్కూటీ ఎక్కించుకొని.. కళ్ళలో కారం చల్లి మంగళ సూత్రాన్ని లాక్కెళ్ళారు. పట్టుబడ్డ ఇద్దరు చెడు వ్యసనాలకు అలవాటు పడి పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్, బండి నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు ట్రేస్ చేశారు. గతంలో ఎక్కడైనా దొంగతనాలు చేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. సోషల్ మీడియాలో వీరి దొంగతనం గురించి తెగ వైరల్ అవుతోంది.