పొగాకు శనగ పంటలను పరిశీలించిన సీనియర్ సైటిస్ట్ డాక్టర్ జి.ప్రసాదు బాబు కందుకూరు

పొగాకు శనగ పంటలను పరిశీలించిన సీనియర్ సైటిస్ట్ డాక్టర్ జి.ప్రసాదు బాబు  కందుకూరు

 జనం న్యూస్

వలేటివారిపాలెం మండలంలోని నందలపూరు గ్రామంలో రైతులతో కలిసి శనగ మరియు పొగాకు పంటలను కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జి . ప్రసాద్ బాబు మరియు మండల వ్యవసాయ అధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ పంట పొలాలను పరిశీలించడం జరిగింది. శాస్త్రవేత్త జి ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ శనగలలొ ప్రస్తుతం వేరు కుళ్లు, మొదలు కుళ్ళు, ఎండు తెగుళ్లు గమనించడం జరిగింది. వీటి నివారణకు వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి, కిలో విత్తనానికి 1.5 గ్రాములు విటా వాక్స్ పవర్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ట్రైకోడెర్మా విరిడే మరియు సూడోమోనాస్ జీవ సిలింద్రనాసీనులను ఎకరాకు రెండు కిలోలు చొప్పున 100 కిలోల పెడ ఎరువులొ కలుపుకొని ఆఖరి దిక్కులో వేసుకోవాలి. ప్రస్తుతం ఈ తెగులు నివారణకు సాఫ్ మందును రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలు మరియు నేల తడిచే విధంగా పోసుకోవాలి. శనగలొ తుప్పు తెగులు రాకుండా పంట విత్తిన 50 నుండి 60 రోజులప్పుడు ఎకరాకు హెక్సాకొనసోల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనసోల్ 200 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవాలి. శనగ పంటలో కాంప్లెక్స్ ఎరువులకు బదులు సింగల్ సూపర్ ఫాస్ఫెట్ వాడుకున్నట్లయితే మొక్కకు కావలసిన సల్ఫర్ కూడా లభ్యమయి దిగుబడి పెరిగే దానికి అవకాశం ఉంటుంది. అలాగే పొగాకు పంటలో లద్దపురుగు మరియు ఆకుమచ్చ తెగులు గమనించడం జరిగింది. లద్దె పురుగు నివారణకు ఏమామెమిక్టన్ బెంజోయేట్ 100 గ్రాములు లేదా నో వాల్యూరాన్ 200 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవాలి. ఆకు మచ్చ నివారణకు కార్బన్డిజం 100 గ్రాములు లేదా క్యాబ్రియో టాప్ 400 గ్రాములు ఎకరాకు పిచికారి చేసుకోవాలి.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు టి.శశిధర్ మరియు రైతులు పాల్గొన్నారు.