*శ్రీ వాణీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు*

*శ్రీ వాణీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు*

 జనం న్యూస్ : జనవరి:12: శుక్రవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జిసంక్రాంతి పండుగను కళ్ళకు కట్టినట్లు సెట్టింగ్ శ్రీ వాణి స్కూల్ లో ఏర్పాటు చేశారు . మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.విద్యార్థిని,విద్యార్థులు,హరిదాసు, సోది చెప్పేవారు, రైతు, కుటుంబం, అమ్మమ్మ ,నాన్నమ్మ,తాతయ్యా,మనుమడు ,మనుమరాలు, గంగిరెద్దుల వారు,వివిధ వేషధారణలో సాంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు ముస్తాబై వచ్చారు. గంగిరెద్దుల వారిని గ్రామం నుండి ప్రత్యేకంగ పిలిపించి గంగిరెద్దుల ఆటలు ప్రదర్శింపచేయడం వాటిని తిలకించి పాఠశాల విద్యార్థులు కేరింతల కొడుతూ సంబరపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ .సి. హెచ్.సత్యం మాట్లాడుతూ మరుగుపడుతున్నటువంటి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియపరచడం,మరియు పండుగల విశిష్టతను గురించి తెలిపారు. పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి 2016 అనురాథా, రెండోవ బహుమతి 1516 సునంద, మూడో బహుమతి 1016 మౌనిక ,విద్యార్థినులకు ముగ్గుల పోటీల్లో,మరియు పతoగి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి మరియు కన్సోలేషన్ బహుమతులు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ కృపాకర్ , ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.