ప్రపంచంలోనే నాసిన్ అకాడమీ గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ గా నిర్మాణం

ప్రపంచంలోనే నాసిన్ అకాడమీ గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ గా నిర్మాణం

-----ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

జనం న్యూస్ జనవరి 15 గోరంట్ల శ్రీ సత్య సాయి జిల్లా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఐఆర్ఎస్ శిక్షణా కేంద్రం శ్రీ సత్య సాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద దాదాపు 1400 కోట్లతో ముసలి తర్వాత కష్టం ట్రైనింగ్ సెంటర్ అకాడమీ ప్రపంచ ప్రమాణాలతో నిర్మించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు, ఈనెల 16వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నాసిన్ అకాడమీ ని ప్రారంభిస్తున్న సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా బిజెపి అధ్యక్షులు జిఎం శేఖర్ తో కలసి ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై ఆదివారం పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాసిన్ అకాడమీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ గా నిర్మాణం పూర్తి దశకు చేరుకుని చరిత్రకు ఎక్కుతుందన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల మందికి ఉపాధి కల్పన రావడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ కూడా సర్వే పూర్తిచేయడం జరిగిందన్నారు, రాష్ట్రంపై కేంద్రం ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని తెలిపారు, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఇద్దరు కేంద్ర ఆర్థిక శాఖ అధ్యక్షులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఇతర పార్టీ ప్రముఖులు ఇతర అధికారులు హాజరు కావడం జరుగుతుందన్నారు,

విభజన హామీల్లో భాగమే నాసిన్ సంస్థ నిర్మాణం బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం. శేఖర్...

విభజన హామీల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నాసిన్ అకాడమీ దాదాపు 500 ఎకరాలలో మొదటి దశలో 900 కోట్లతో నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని కేవలం 16 నెలల కాలంలోని దేశంలోని అత్యున్నత ప్రమాణాలతో ఐఆర్ఎస్ ఐపీఎస్ ఐఏఎస్ లకు ట్రైనింగ్ శిక్షణతో పాటు ఆడిట్, జిఎస్టి,నార్కోటిక్ తదితర శాఖలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు, వెనుకబడిన శ్రీ సత్య సాయి జిల్లాలో నాసిన్ అకాడమీ రావడం అదృష్టమని అతి తక్కువ కాలంలోనే నిర్మాణం పూర్తి చేసుకోవడం తోపాటు 16న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ప్రారంభించడం జరుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బూదిలి సుదర్శన్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు హసనాపురం చంటి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ నాయకులు పిడి పార్థసారథి, అసెంబ్లీ కన్వీనర్ మేదర్ శ్రీనివాసులు, ఆదర్శ్ కుమార్, మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.