సర్పంచ్ కు, పాటూరి శంకర్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదు

సర్పంచ్ కు, పాటూరి శంకర్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదు

-----మేము వైసీపీ కాదు... టిడిపిలోనే ఉన్నాం....

జనం న్యూస్ జనవరి 15 గోరంట్ల శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం

మా ఇంటి సమస్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సర్పంచ్ శివానందకు, పాటూరి శంకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని గోరంట్ల మండలంలోని మల్లాపల్లి పంచాయతీ ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన దేవా నరేంద్ర దేవా సూర్యనారాయణ దేవ సుబ్బమ్మ లు తెలిపారు, అనవసరంగా వైఎస్ఆర్ పార్టీ తో పాటు నాయకులను మమ్ములను కలుపుతూ ఇంటి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని... విలేకరుల ఎదుట బాధితులు వాపోయారు, 2023 మార్చి 27వ తేదీన చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నామని అయితే రామాంజనం అనే మహిళ తనకు హక్కు ఉందని అనవసరంగా మా చిన్నాన్న ప్రోత్బలంతో ఇలాంటి ఆరోపణలకు దిగుతూ తమకు ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు, మాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 1983 నుండి పార్టీలోనే ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ సభ్యత్వం కూడా పొందామని సభ్యత్వం కార్డులను చూపుతూ తమకు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని వారు ఈ సందర్భంగా కోరారు.