బొబ్బిలి ఎమ్మెల్యే ప్రెస్ మీట్

బొబ్బిలి ఎమ్మెల్యే ప్రెస్ మీట్

జనం న్యూస్. బొబ్బిలి. తేదీ. 11/01/2024. గురువారం.

నిన్న బుధవారం నాడు బొబ్బిలిలో, బహిరంగ సభలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని, అసత్యాలే మాట్లాడారని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి విమర్శించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో,రాష్ట్రం గత ఐదేళ్లగా అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు.బొబ్బిలి నియోజకవర్గం గురించి,అదే విధంగా విజయనగరం జిల్లా గురించి,చంద్రబాబు నాయుడు అవగాహన లేని మాటలు మాట్లాడారని విమర్శించారు. రాజకీయాలకు,భగవంతునికి ముడిపెడుతూ,దేవుని పేర్లను ఉచ్చరించడం అతని అవగాహనా రహిత్యానికి నిదర్శనం అని అన్నారు.తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో,175 సీట్లు వైసిపి గెలుచుకుంటుందని,అలాగే,బొబ్బిలిలో కూడా వైసిపి జెండా ఎగురుతుందని,ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు...