జయహో బీసీ చైతన్య యాత్ర రథాన్ని ప్రారంభించిన బుద్ధ నాగ జగదీష్

జయహో బీసీ చైతన్య యాత్ర రథాన్ని ప్రారంభించిన బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జనవరి 11 (అనకాపల్లి జిల్లా)

తెలుగుదేశం పార్టీ జయహో బీసీ చైతన్య యాత్ర సమావేశం ఈరోజు ఉదయం అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ మాడుగుల నియోజవర్గం ఇంచార్జ్ పి వి జి కుమార్ చోడవరం నియోజవర్గ ఇన్చార్జ్ బత్తుల తాతయ్య బాబు యలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారని, ఈ సందర్భంగా చైతన్య యాత్రను ముఖ్య అతిథులు సమక్షంలో నాగ జగదీష్ తెలుగుదేశం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న దాడులు అరాచకాలు బీసీ నిధులు రద్దుచేసి దారి మళ్లించి బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్టర్లుగా వైసిపి కార్యకర్తలను నియమించుకొని ప్రజాధనాన్ని వారికి జీతాల రూపంలో ఇస్తూ బడ్జెట్లో కేటాయించిన నిధులను బీసీలకు అందకుండా చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీల ద్రోహిగా, నమ్మించి మోసం చేశారని నాగ జగదీశ్ అన్నారు. జగన్ రెడ్డి నియంత్రత్వ పోకడలు అరాచక పాలన గురించి వైసిపి దోపిడీలు ఇసుక మైన్ మట్టి గ్రావెల్ భూ అక్రమాలను ప్రజలకు వివరించడానికి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లో అన్ని ప్రాంతాల్లో బీసీ చైతన్య యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని నాగ జగదీష్ అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు పార్లమెంటు గవర సాధికారిత కన్వీనర్ మల్ల సురేంద్ర బీసీ సెల్ కోఆర్డినేటర్ గుర్రము నూకరాజు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు గింజల లక్ష్మణరావు దేవాంగుల సాధికారత కన్వీనర్ బత్తుల లక్ష్మి రాష్ట్ర యాత సాధికారత కన్వీనర్ వనo శ్రీనివాసరావు పార్టీ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ జూరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.//