రైతులను ఆదుకోవాలి

రైతులను ఆదుకోవాలి

జనం న్యూస్, నవంబర్ 06

విజయనగరం

వర్షాభావం వల్ల ఈ ఏడాది రైతులు ఆర్థికంగా నష్టపోయారని, తక్షణమే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ,జనసేన నేతలు

డిమాండ్‌ చేశారు.

జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో రైతు గర్జన కార్యక్రమం నిర్వహించారు. 

ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు తమ బాధను తెలియజేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టతున్నాయని వాపోయారు.

ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ 

తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతాంగం ఉంటే... వారి సమస్యలపై క్యాబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం జగన్ ప్రభుత్వానికి అన్నదాతల సమస్యల పట్ల ఉన్న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నమన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంపై లేదన్నారు.

కరువు మండలాలకు సం బంధించి కలెక్టర్లు.. రాష్ట్రంలో 470మండలాల్లో వర్షా భావ పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇస్తే.. ప్రభుత్వం కేవలం 103 మండలాలు మొక్కుబడిగా ప్రకటించడం రైతుల్ని వంచించడం కాదా అని ప్రశ్నించారు.

కరు వు పరిస్థితుల నివారణ కోసం ప్రభుత్వం పైసా కూడా నిధులు ఇవ్వలేదన్నారు. జీవో-4 నాలుక గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని ఎద్దేవా చేశారు.

విజయనగరం జిల్లా లోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ నేతలు ఐవిపిరాజు, బొద్దల నర్సింగరావు, గంట పోలినాయుడు , వేచలపు శ్రీను, రాజేష్ బాబులు మాట్లాడుతూ

ఒక్కో ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశారని, వర్షభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

మొక్కుబడిగా 103 కరువు మండలాలు ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు.

 రాష్ట్రం లో ప్రాంతాలవారీగా పడాల్సిన వర్షం… పడిన వర్షాన్ని లెక్కలోకి తీసుకోకుండా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం బాధాకరమన్నారు. 

జీవో నెం- 4ద్వారా కరువు మండలాలు ప్రకటించడం తప్ప.. రైతుల కోసం రూపాయి సాయం చేసింది లేదని విమర్శించారు.

రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో కోరుకొండ టిడిపి నేతలు సిరిపురపు బంగారు నాయుడు,రొంగలి కృష్ణ, గొర్లె అప్పల కృష్ణ ,పప్పలనాయుడు

కోరుకొండ జనసేన నేతలు సిరిపురపు దేముడు, సిరిపురపు శ్రీనివాసరావు,గాలి నాగరాజు,గంట్లాన సింహద్రి,సిరా అప్పన్న

నియోజకవర్గ జనసేన నేతలు కాటం అశ్విని,

మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ, రవితేజ, చక్రవర్తి, ఎమ్ .పవన్ కుమార్ ,నవీన్ కుమార్ , పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్, , వెంకట రమణ, మధు , తదితరులు పాల్గొన్నారు