విజయనగరం జిల్లాలో 5 అసెంబ్లీ సీట్లు రద్దు

విజయనగరం జిల్లాలో 5 అసెంబ్లీ సీట్లు రద్దు

జనం న్యూస్,ఫిబ్రవరి 06 విజయనగరంఉమ్మడి విజయనగరం జిల్లాలో 2004 ఎన్నికలవరకు 12 అసెంబ్లీ సీట్లు ఉండేవి. 2009లో జరిగిన
నియోజకవర్గాల పునర్విభజనతో ఆ సంఖ్య 9కి చేరింది.గతంలో ఉన్న సతివాడ, భోగాపురం, నాగూరు,తెర్లాం, ఉత్తరపల్లి నియోజకవర్గాలు రద్దు అయ్యాయి.కొత్తగా నెల్లిమర్ల, కురుపాం ఏర్పడ్డాయి. వీటితోపాటు పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి,గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట ప్రస్తుతం ఉన్నాయి.