విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషను

విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషను

జనం న్యూస్,జనవరి 14 విజయనగరంఐదు

విజయనగరం పట్టణం గంట స్థంభం వద్ద తప్పిపోయిన తమటాపు దీక్షిత, 6 సం.లు బాలికను విజయనగరం డీఎస్పీ శ్రీ ఆర్.గోవిందరావు గారి సమక్షంలో ఆమె తల్లిదండ్రులకు వన్ టౌన్ పోలీసులు జనవరి 13న అప్పగించారు. సంక్రాంతి పండగకు బట్టలు కొనుగోలు చేసేందుకు గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన తమటాపు పైడి నాయుడు కుటుంబ సంభ్యులతో కలసి విజయనగరం పట్టణం కు జనవరి 13న వచ్చినారు. షాపింగు చేసుకొనే క్రమంలో వారి కుమార్తె దీక్షిత వారి నుండి వేరై, తప్పిపోయింది. ట్రాఫిక్ పోలీసు బాలికను ఒంటరిగా ఏడుస్తూ, తిరగడాన్ని గమనించి, వన్ పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ హెచ్.సి. ఆవు వెంకట రమణ బాలికను బుజ్జగించి, వారి తల్లిదండ్రుల గురించిన సమాచారాన్ని సేకరించి, గంట్యాడ మండలం మురపాక గ్రామస్తులకు సమాచారం అందించి, వారి సహకారంతో తల్లిదండ్రుల ఫోను నంబరు సేకరించి, వన్ టౌన్ పోలీసు స్టేషనులో బాలిక దీక్షిత సురక్షితంగా ఉన్నట్లుగా సమాచారం అందించారు. తల్లిదండ్రులు పౌద్ నాయుడు, వరలక్ష్మి స్టేషనుకు రాగా, విజయనగరం డీఎస్పీ ఆ.గోవిందరావు సమక్షంలో, వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపి, బాలికను తీసుకొని వారి గ్రామానికి వెళ్ళిపోయారు. వేరే ప్రాంతాలకు వచ్చే సమయంలో తమ పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.