ఇంద్రకీలాద్రి పై అంగ రంగ వైభవముగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

ఇంద్రకీలాద్రి పై అంగ రంగ వైభవముగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

ఇంద్రకీలాద్రి పై అంగ రంగ వైభవముగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

   *విజయవాడ జనం న్యూస్ ప్రతినిధి.*

     ఈరోజు భోగి సందర్బంగా ఉదయం ఆలయ స్థానాచార్యుల వారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించి వేద మంత్రోచ్చారణాల నడుమ సాంప్రదాయబద్ధముగా గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, మేళములతో వైభవముగా భోగి మంటలు కార్యక్రమం ప్రారంభం...

కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించి, భోగి మంటలు వెలిగించి, ప్రదక్షిణలు చేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు , కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు , స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు సిబ్బంది మరియు భక్తులు..

భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపి, శ్రీ అమ్మవారి స్వామివారి కృపాకటాక్షములు అందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపిన ఆలయ చైర్మన్, కార్యనిర్వాహణాధికారి గార్లు ..

సంక్రాంతి సందర్బంగా మహామండపం 07వ అంతస్తు పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు..

బొమ్మల కొలువు వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించి బొమ్మల కొలువు ప్రారంభించిన ఆలయ చైర్మన్, కార్యనిర్వాహనాధికారి ..

సంక్రాంతి సందర్బంగా బొమ్మల కొలువు మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించిన చైర్మన్ గారు, కార్యనిర్వాహణాధికారి వారు..

ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసములు, హరిదాసు కీర్తనలు, బొమ్మల కొలువు, వివిధ వర్ణముల ముగ్గులు, అయోధ్య రామమందిరం ముగ్గు, ఎద్దుల బండి, కోడి పుంజులు, రైతు, నాగలి, గుడిసె, రోకలి, చెరకు గడలు, తదితరములు ..

కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ , పాలక మండలి సభ్యులు, వైదిక కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది..

ఉదయం నుండి విశేషముగా అమ్మవారి దర్శనార్థం వస్తున్న భక్తులు... సంక్రాంతి సందర్బంగా దేవస్థానం నందు ఏర్పాట్లును విశేషముగా తిలకిస్తున్న భక్తులు..