అబ్బా ఇదేం కొట్టడం తల్లి... నడి రోడ్డుపై ఈ మహిళ అతన్ని ఎలా కొడుతోందో మీరే చూడండి. ( వైరల్ వీడియో).

అబ్బా ఇదేం కొట్టడం తల్లి... నడి రోడ్డుపై ఈ మహిళ అతన్ని ఎలా కొడుతోందో మీరే చూడండి. ( వైరల్ వీడియో).

జనం న్యూస్: మనం కొన్ని కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద వెళ్తుంటే.. కొంత మంది పరాచకాలు ఆడుతుంటారు. ఐతే ఆ పరాచకాలు తెలిసిన వారు ఆడితే పర్లేదు కానీ, ముక్కు, మెుహం తెలియని వారైతే.. ఇంకేముంది! అక్కడ పెద్ద రణరంగమే జరుగుతుంది. ఇలాంటి రణరంగమే తాజాగా రాజస్థాన్ లో జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్కూటీ పై వెళ్తున్న ఓ యువతికి, ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తి స్కూటీ ఆపి మరి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇంకేముంది ఇక అతడికి దబిడి.. దిబిడే..! ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే. రాజస్థాన్ లోని జోధ్ పుర్ కు చెందిన ఓ యువతి తన స్కూటి పై పని మీద ఎటో వెళ్తోంది. ఈ క్రమంలోనే సదరు యువతి స్కూటీకి ఎదురొచ్చిన ఓ ప్రబుద్ధుడు.. ఆమెను ఆపాడు. స్కూటీని ఆపడంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. అతడిని చెడా మడా తిట్టింది. యువతి తిడుతుండగానే ఆ వ్యక్తి ఆమెకు ఉన్నపలంగా ఐ లవ్ యూ అని చెప్పాడు. ఇక అంతే సంగతులు ఆ మహిళ భద్రకాళిలా మారి వాడి అంతు చూసింది. రోడ్డు పై పడేసి మరి ఆ చెంపా.. ఈ చెంపా అని చూడకుండా పిచ్చికొట్టుడు కొట్టింది. అతడి వాలకం చూస్తోంటే.. అతడు తాగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. సదరు మహిళను ప్రాధేయపడుతున్నా గానీ, ఆమె వినకుండా అతడిని చితక బాదింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. “ఈ వయసులో నికెందుకు సామీ ఈ లవ్వులు.. గివ్వులు” అందరు ఆడాళ్లు ఒకేలా ఉండరు.. తాట తీస్తారు” అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. 

కింద లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి 

https://twitter.com/hardintessa143/status/1578701179210862593?s=20