మద్యం తాగి నడిరోడ్డుపై కానిస్టేబుల్ లొల్లి.. అందరినీ బూతులు తిడుతూ...! ( వీడియో చూడండి )
జనం న్యూస్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై లారీలను ఆపి లారీ డ్రైవర్లతో డబ్బులు వసూలు చేస్తూ వీరంగం సృష్టించాడు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి. రాజా మల్లయ్య అనే వ్యక్తి మద్యం సేవించి తన కారును రోడ్డు మధ్యలో ఆపి.. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్లను ఆపుతూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తు ప్రశ్నించిన వారిని దుర్బాశలాడుతూన్నారు దీంతో ఆగ్రహించిన స్థానికులు 100 నెంబర్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.