దారుణం.. షాపింగ్ మాల్ పై తండ్రి చేతులనుంచి జారీ పడి పసికందు మృతి.

జనం న్యూస్: కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం మిలిగింది. భార్య షాపింగ్‌ చేస్తుంటే ఇద్దరు చిన్నారులను తీసుకుని మూడో అంతస్తులో వేచి చూస్తున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో అనుకోని విధంగా అతని చేతుల్లో నుంచి ఏడాది వయసున చిన్నారి జారి కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన హృదయ విదారక వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్‌ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం (మార్చి 19) రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని సిటీ సెంటర్ మాల్‌కు భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. భార్య షాపింగ్‌ చేస్తుండగా.. ఐదేళ్ల వయసున్న కుమారుడితోపాటు ఏడాది వయసున్న కుమారుడిని తీసుకుని తండ్రి మూడో అంతస్తులో ఉన్న ఎస్కలేటర్‌ వద్దకు వచ్చారు. ఒక చేత్తో ఏడాది పసి బిడ్డను ఎత్తుకుని, మరో చేతో ఐదేళ్ల కుమారుడిని పట్టుకున్నాడు. ఇంతలో పెద్ద కుమారుడు ఎక్కలేరట్‌ పైటి ఎక్కేందుకు యత్నించగా తండ్రి వారించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మరో చేతిలో ఉన్న ఏడాది బిడ్డ మూడో అంతస్తు నుంచి జారిపోయాడు. షాపింగ్‌ మాల్‌లో అంత ఎత్తునుంచి చిన్నారి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తమోడుతున్న చిన్నారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. చిన్నారి మృతితో ఆ తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కాగా మూడో అంతస్తు నుంచి చిన్నారి పడిపోతున్న గుండెలు పిండేసే దృశ్యాలు ఆ షాపింగ్‌ మాల్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.