పల్సర్ బైక్ తో నదిని దాటిన యువకుడు.. దీనిని పిచ్చి అనాలా వెర్రి అనాలా...!

జనం న్యూస్: రోడ్డు మీద కొద్దిపాటి నీళ్లున్నా, కాస్త ఇసుక ఉన్నా బైక్‌ నడపడానికి చాలా ఇబ్బంది పడతారు వాహనదారులు. అలాంటిది ఓ యువకుడు ఏకంగా తన బైక్‌తో నదినే దాటేసాడు. పోనీ అదేమైనా నీటిలోనూ, రోడ్డుపైనా నడిచే టూ ఇన్‌ వన్ బైకా అంటే అదీ కాదు.. అది మామూలు పల్సర్‌ బైక్‌. నదిలో నీరు తక్కువగా ఉండటంతో యువకుడు ఈ సాహసం చేసినట్టు తెలుస్తోంది. నదిలో రెండు అడుగుల కంటే ఎక్కువ నీరు లేకపోవడంతో అతను ఎంతో చాకచక్యంగా బైక్‌ పైన నదికి ఈ వైపు నుంచి అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడు. ఏది ఏమైనా నదిలో బైక్‌ నడపడం పెద్ద సాహసమే. ఈ వీడియో నెట్టిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ యూట్యూబ్ చానల్ ఈ వీడియోని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. సంకల్పం బలంగా మార్గం ఉంటుంది. ఎంతటి సాహసమైనా చేయిస్తుంది.. అయితే ఈయువకుడు చేసినది తెలివైన పనా? ప్రమాదకరమైన పనా? అంటూ ప్రశ్నిస్తూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీడియోను 5 లక్షల మందికి పైగా వీక్షించారు.