ఇదేం పిచ్చమ్మ.. సచ్చిపోతే చూసే దిక్కు కూడా లేదు అక్కడ.. (వీడియో చూడండి)

జనం న్యూస్: సోషల్ మీడియా వినియోగం అందుబాటులోకి వచ్చిన నుంచి అందరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా.. ఇప్పుడంతా సోషల్ మీడియా రీల్స్ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిఒక్కరూ 24 గంటలు సోషల్ మీడియాలోని రీల్స్ చేస్తూ ఈ ప్రపంచాన్నే మార్చిపోతున్నారు. అంతేకాకుండా ఈ రోల్స్ యుగంలో.. విపరీతమైన క్రేజ్, భారీ ఫాలోవర్స్, లక్షకొలది లైక్స్ కోసం ప్రాణాలను సైతం పనంగా పెడుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో విచిత్రమైన ఆలోచనలతో ఎవ్వరు ఊహించని విచిత్ర పనులను చేస్తుంటారు. అయితే వాటిలో కొన్ని ఉపాయోగకరమైనవి, ఫన్నీ రీల్స్ ఉంటే.. మరికొన్ని షాకింగ్ గా ఉంటాయి. ఇక వీటిని చూసిన నెటిజన్స్ విమర్శలతో దుమ్మెత్తి పోస్తుంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రాణాలను పొగొట్టుకునే రీల్స్, ప్రాణాలను రిస్క్ చేసే రిల్స్ తో చాలానే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ప్రాణాలను రిస్క్ చేసే ఓ వీడియో అనేది నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం అంతా సోషల్ మీడియా రీల్స్ యుగం నడుస్తుంది. అయితే దీనిలో ఎక్కువ శాతం యువత ఈ సోషల్ మీడియా రీల్స్ కు బాగా ఎడిక్ట్ అయ్యారనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం, అలాగే విపరీతమైన లైక్ లు, భారీ ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం.. రిస్క్ మించిన వీడియోలను చేస్తూ హైలేట్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా.. ఓ మహిళ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఒక యువతి ఎత్తైన చెట్టు కొమ్మలపై ఎక్కి డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది. అయితే ఈ వీడియో అనేది miss_pooja అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయింది. కాగా, ఆ వీడియోలో ఓ యువతి సాంప్రదాయ దుస్తులు ధరించి చెట్టు ఎక్కి ఉండడమే కాకుండా.. ఆ చెట్టు మీద ఎక్కడ స్థలం లేనట్టుగా చిగురున నిల్చొని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఆ వీడియోలోని యువతి లెహంగా, చున్నీ వేసుకుని “చైన్ మేరా ట్యూనే లే లియా“ పాటకు ప్రమాదకర పరిస్థితుల్లో డ్యాన్స్ చేస్తూ హల్‌చల్‌ చేసింది. ఇక ఆమె డ్యాన్స్‌ను కింద ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్స్ స్పందిస్తూ సదరు యువతను రకరకాలుగా కామెంట్లు పెడుతూ విమర్శించారు. అసలు సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాలను కూడా లెక్క చేయడంలేదని ఒక్కఒక్కరూ ఒకో విధంగా స్పందిస్తున్నారు.