లైవ్ లో కూలిపోయిన డ్రాప్‌ టవర్ రైడ్..! అందరూ చూస్తుండగా ఘోరం.. ( వీడియో చూడండి)

లైవ్ లో కూలిపోయిన డ్రాప్‌ టవర్ రైడ్..! అందరూ చూస్తుండగా ఘోరం.. ( వీడియో చూడండి)

జనం న్యూస్: ప్రస్తుత బిజీ లైఫ్​లో కాస్త విరామం దొరికినా తమ కుటుంబంతో గడిపేందుకు చాలా మంది ఇష్టపడతారు. వారితో కలసి హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లి భోజనాలు చేస్తుంటారు. గ్యాప్ దొరికితే కొందరు ఆలయాలను వెళ్తుంటారు. మరికొందరు సినిమాలకు వెళ్తుంటారు. ఇంకా ఎక్కడైనా తిరనాళ్లు, జాతరలు లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటే అక్కడికీ వెళ్తారు. ఉత్సవాలలో దేవుడి దర్శనాలతో పాటు ఆడుకోవడానికి ఎన్నో గేమ్స్ ఉంటాయి. అయితే అలాంటి ఉత్సవాల్లో అనూహ్య ప్రమాదాలు జరిగిన ఘటన​ల గురించి విన్నాం. అలాంటి మరో ఘటన రాజస్థాన్​లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్‌లో జరిగిన ఒక ఉత్సవంలో డ్రాప్‌ టవర్ రైడ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. టవర్​ రైడ్ కూలిన ఘటన సోమవారం జరిగింది. రైడ్స్ కేబుల్ తెగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక వీడియో క్లిప్​లో రైడ్ కిందకి వస్తున్నప్పుడు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. క్షణాల్లో ఎత్తైన ఊయల అకస్మాత్తుగా నేలపైకి పడిపోవడాన్ని వీడియోలో చూడొచ్చు. ఊయల అమాంతం కిందకు పడిపోవడంతో అందులోని వారి అరుపులు, కేకలు వినిపించాయి. ఇతర వీడియో క్లిప్స్​లో కూడా కుప్పకూలిన రైడ్ చుట్టూ జనాలు నొప్పి, బాధతో ఏడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. 

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి

https://twitter.com/AHindinews/status/1638210961763979266?s=20

 

Files