పబ్లిక్ ట్రైన్ లో బహిరంగంగా అమ్మాయిల పిచ్చి వేషాలు.. వీరికి బుద్ధి చెప్పాలి అంటున్న ప్రజలు..

జనం న్యూస్: ఢిల్లీ మెట్రో వేలాది మంది ప్రయాణికులకు గమ్య స్థానాలకు చేరుస్తూ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఢిల్లీ మెట్రో నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మెట్రో రైల్లో కొందరు ప్రయాణికుల పిచ్చి చర్యలతో సోషల్‌ మీడియాల్లో వార్తల్లో నిలుస్తుంటుంది. పిచ్చి వేశాలకు ఢిల్లీ మెట్రోను కేరాఫ్‌గా మార్చుకుంటున్నారు కొందరు. తాజాగా ఇలాంటి ఓ వింత ఘటన నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. ఇంతకీ వాళ్లేం చేశారంటే ఎలాగైనా వైరల్‌ అవ్వాలి, లైక్‌లు కొట్టేయాలనే కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు మెట్రోలో రచ్చ రచ్చ చేశారు. ఇద్దరు అమ్మాయిలు మెట్రోలో హోలీ ఆడారు. అయితే అదేదో సరదాగా ఉంటే బాగుండేది కానీ అసభ్యకరంగా వ్యవహరించారు. నడుస్తున్న మెట్రోలో ఒకరిపై ఒకరు రంగులు పూస్తూ డ్యాన్స్‌ చేశారు. ఓ రొమాంటిక్‌ సాంగ్‌కు అనుగుణంగా హావభావాలు పలికించారు. అందరి ముందు అభ్యంతరరంగా ప్రవర్తించడంతో ఇతర ప్రయాణికులు సైతం ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోను మరో వ్యక్తి రికార్డ్‌ చేయగా వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చేసిన నెటిజన్లు యువతుల తీరును తిట్టిపోస్తున్నారు. లైక్‌లు, వ్యూస్‌ కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ చివాట్లు పెడుతున్నారు. మరి మెట్రో అధికారలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్‌ చేస్తూ వీడియో తీయగా అధికారులు తప్పుపట్టిన విషయం తెలిసిందే. మరి దీనికి అధికారులు ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపిస్తారో చూడాలి.