హోలీ పేరుతో నడి రోడ్డుపై అమ్మాయిల చిల్లర వేషాలు..! పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
జనం న్యూస్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. అయితే తమ వీడియోలు వైరల్ గా మారేందుకు.. అందరికి కంటే భిన్నంగా చేయాలని భావిస్తున్నారు. అయితే ఇలా చేసే క్రమంలో కొందరు శృతిమించి..వికృత చేష్టాలు చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఇలాంటి వాటిల్లో యువతులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. రెండు రోజుల క్రితమే ఇద్దరు యువతులు ఢిల్లీ మెట్రో ట్రైన్ లో హోలీ పేరుతో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వారిద్దరికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. ఆ ఇద్దరు యువతులు రంగులు పూసుకుంటూ రొమాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వుతోంది. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూన రంగుల్లో తడిసి ముద్దవుతున్నారు. ఇలా దేశ ప్రజలందరూ హోలీ సంబరాల ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ ఓ వీడియో ఆగ్రహం తెప్పిస్తోంది. అది చూసిన జనాలు భగ్గున మండిపోతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియోలో ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా ఇద్దరు అమ్మాయిలు వెనుకాల ఎదురెదురుగా కూర్చున్నారు. అంతేకాక రంగులు పూసుకుంటూ రోమాన్స్ చేశారు. అమ్మాయిలిద్దరూ మోహే రంగ్ లగా దే పాటపై స్కూటర్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో చూసిన కొందరు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారా లేక రొమాన్స్ చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డుపై ముఖాలు అతుకుంటూ, హీరోహీరోయిన్ తరహాలో రచ్చ చేశారు. తాము నడిరోడ్డుపై ఉన్నామనే కనీస జ్ఞానం మరచి శృతి మించి ప్రవర్తించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో గ్రేటర్ నోయిడాకు చెందినదని తెలుస్తోంది. వాళ్లు పబ్లిక్ కి ఇబ్బంది పెట్టే పనులు చేయడమే కాకుండా.. వారిలో ఏ ఒక్కరికి కూడా హెల్మెట్ ధరించలేదు.ఈ వీడియోను షేర్ చేస్తూ పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా హోలీ పేరుతో యువతీ యువకులు అశ్లీలతను వ్యాపింపజేశారని, ఇలాంటి నీచమైన పనులు ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కొందరు యువత మెట్రో రైళ్లలోలో రోమాన్స్ లు చేసిన ఘటనలు జరిగాయి. యువత ఇలాంటి వీడియోలు చేసి.. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.