కామారెడ్డి జిల్లా కేంద్రం లో ఓపెన్ టెన్త్ లో అక్రమాలపై విచారణ కమిటీ ఏం చేస్తుంది*

కామారెడ్డి జిల్లా కేంద్రం లో ఓపెన్ టెన్త్ లో అక్రమాలపై విచారణ కమిటీ ఏం చేస్తుంది*

*అన్ని ఆధారాలు సమర్పించిన అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు ఏవి?.

*ఆధారాలు సమర్పించిన చర్యలు తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారి.

 *పరీక్షా కేంద్రానికి వెళ్ల లేదని అంటూ తప్పించుకుంటున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంఈఓ ఎల్లయ్య?.

*మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య ప్రధాన అనుచరుడు గా వ్యవహరిస్తున్న కృష్ణారెడ్డి పై చర్యలు ఎక్కడ?

*డబ్బులు తిరిగి ఇవ్వాలంటున్న బాధితులు.

జనం న్యూస్ స్టేట్ క్రైమ్ ప్రతినిధి జూన్ 29:  కామారెడ్డి జిల్లాలో జరిగిన ఓపెన్ టెన్త్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ పేరిట కాలయాపన చేస్తూ నిజాలను మరుగున పడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగస్వామ్యమైన ఉద్యోగులను తప్పించే ప్రయత్నం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఓపెన్ టెన్త్ పరీక్షల్లో కోట్లలో చేతులు మారినాయి అనే విషయాన్ని కొందరు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ ఒక కమిటీని వేసి తూతూ మంత్రంగా విచారణ కొనసాగిస్తున్నారు.కామారెడ్డి జిల్లాలో ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ 25 నుంచి నిర్వహించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ వాడ హై స్కూల్ మరియు బాలికల  ఉన్నత పాఠశాల లలో జరిగినటువంటి ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ పరీక్షల లలో ఒకరికి బదులుగా ఇంకొకరు పరీక్షలు రాస్తు స్టేట్ అబ్జర్వర్ పరిశీలనలో నలుగురు విద్యార్థులు ఒకరికి బదులుగా ఇంకొకరు పరీక్షలు రాస్తూ దొరికిపోయారు. ఒకరికి బదులు ఇంకొకరు పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చిన పరీక్ష కేంద్రం ఇంచార్జ్ వారికి సహకరించిన విద్యార్థుల దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర సుమారుగా 5000 నుండి 15 వేల వరకు తీసుకొని వారికి పరీక్ష రాయడానికి అనుమతిని ఇచ్చారు. ఈ అక్రమాలపై విద్యాశాఖ జిల్లా అధికారి ని వివరణ కోరగా జరిగినా అక్రమాలపై విచారణ కమిటీని వేస్తున్నట్లు చెప్పారు. విచారణ కమిటీ వేసి రెండు నెలలు గడుస్తున్న విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ అక్రమాలకు పాల్పడ్డ వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేరు విచారణను తూతూ మంత్రంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై జిల్లా విద్యాశాఖ అధికారికి పూర్తి ఆధారాలతో సమర్పించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంఈఓ ఎల్లయ్య పై చర్యలు లేనట్టేనా?

ఓపెన్ టెన్త్ పరీక్షలు పరీక్ష కేంద్రానికి వెలుపల ఉన్న మరొక భవనంలో పరీక్ష రాస్తున్నట్లు ఎంఈఓ ఎల్లయ్య పర్యవేక్షణలో తేలింది. ఈ విషయాన్ని గమనించిన విలేకరులు ఈ విషయం గురించి ఎంఈఓ ఎల్లయ్యను అడగడానికి విలేకరులు ప్రయత్నించగా అక్కడినుండి పరిగెత్తుకుంటూ వెళ్లి పరీక్ష కేంద్రంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత విచారణలో ఆరోజు తాను ఆ పాఠశాలను తనిఖీ చేయలేదని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిసింది. అందులో బాధ్యుడని తెలిపే ఆధారాలను జిల్లా విద్యా శాఖ అధికారి అందించి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం శూన్యంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి షోకాజ్ నోటీసు కానీ మెమో కానీ ఇవ్వకపోవడంతో ఆయనపై ఉన్నతాధికారులకు ఎంత ప్రేమ మనకు అర్థం అవుతుంది. ఇప్పటికైనా విచారణలో సక్రమంగా జరిపి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకొని అట్టి డబ్బులను తిరిగి విద్యార్థులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.