అంగన్వాడీలు కడుపు కొట్టడం అన్యాయం... విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత

అంగన్వాడీలు కడుపు కొట్టడం అన్యాయం... విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత

జనం న్యూస్,జనవరి 23

విజయనగరం

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 42 రోజులు నుంచి దీక్ష చేస్తుంటే పట్టించుకోలేని ప్రభుత్వం వారిని ఉద్యోగాల నుండి తొలగించి కడుపు కొట్టడం అన్యాయమైన చర్యగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గారు అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనలు అనుగుణంగానే అంగన్వాడీలు జీతభత్యాలు, పాత బకాయిలు కోరుతున్నారని అన్నారు. అదేమీ గొంతెమ్మ కోరికలు కావని వారిపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. కోర్టు తీర్పు రేపు ఉండగా ముందుగానే ఈ జీవోను తెచ్చి అంగన్వాడీల భయభ్రాంతులను చేసే కక్షపూరిత చర్యలా ఉందని అన్నారు. వీరందరూ వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.