అక్రమంగా తరలిస్తున్న వెదుర్లను పట్టివేత..

అక్రమంగా తరలిస్తున్న వెదుర్లను పట్టివేత..

జనం న్యూస్ 25 మార్చి 2024 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా:  అక్రమంగా తరలిస్తున్న  వెదురుబొంగులను అటవీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. జిల్లా ఫారెస్ట్ అధికారి ఆదేశాల మేరకు మండల ఫారెస్ట్ అధికారి నాసిర్జా ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు రేంజ్ స్టాప్ మరియు మొబైల్ డివైఆర్వో నాగేంద్ర నాయక్ స్టాపు అందరూ గస్తీ నిర్వహిస్తుండగా  అడవిలో వెదురులను అక్రమంగా నరికిఆటోలో తరలిస్తుండగా 15వ తేదీన దాడి చేసి పట్టుకొని మండల ఫారెస్ట్ కార్యాలయానికి తరలించడమైనది.  అదేవిధంగా ఓంకారం సెక్షన్ స్టాప్ తేజ,రామకృష్ణ, సుబ్బయ్య నారపురెడ్డి కుంట సౌత్ బీట్ లోని బొమ్మర రాస్త ప్రాంతంలో వెదుర్లను సైకిళ్లపై అక్రమంగా నరికి తరలిస్తుండగా వారిపై దాడి చేసి వెదురుసైకిలను స్వాధీనం చేసుకుని బేస్ క్యాంపుకు తరలించడం అయినది. స్వాధీనం చేసుకున్న ఆటో నంద్యాల మండలంకు చెందినదిగా  గుర్తించడమైనది. ఆటోలో సైకిల్ పై ఉన్న వెదుర్ల విలువ  సుమారు 50000 రూపాయలు ఉంటుందని అంచనా వేయడమైనది. ఈ సందర్భంగా మండల ఫారెస్ట్ అధికారి నాసిర్జా  మాట్లాడుతూ  ముద్దాయిలను ఉద్దేశించి తీవ్రంగా హెచ్చరించడం జరిగినది. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా వెదురులను కానీ ఏ ఇతర కలపకాని నరికి అక్రమంగా తరలించిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకోని రిమాండ్ కు తరలించడమే కాకుండా జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఫారెస్ట్  అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.