ఆసుపత్రి కార్మికులు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలి : కోన లక్ష్మణ డిమాండ్

ఆసుపత్రి కార్మికులు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలి : కోన లక్ష్మణ డిమాండ్

జనం న్యూస్ జనవరి 11 (అనకాపల్లి జిల్లా)

స్థానిక ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు సంక్రాంతి పండుగలోపు 2నెలలు బకాయి పడ్డ జితాలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ &ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన. లక్ష్మణ డిమాండ్ చేశారు.

గురువారం స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రి లోకార్మికులు తో నిరసన తెలిపి సూపర్డెంట్ శ్రీనివాస్ ని కలిసి కార్మికులకు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని కోరగా స్పందించిన సూపర్డెంట్ సెక్యూరిటీ గార్డ్, శానిటేషన్ కాంట్రాక్టర్లలను కార్మికులకు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని కోరారు‌. శానిటైజెన్ కాంట్రాక్టర్ మాట్లాడుతూ రేపటిలోగా జీతాలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు, సెక్యూరిటీ కాంట్రాక్టర్ మాట్లాడగా త్వరలో జీతాలు చెల్లిస్తామని తెలిపారు. దీనిపై కార్మికులు సూపర్డెంట్ శ్రీనివాస్ కి ఏఐటీయూసీ నాయకులు కోన. లక్ష్మణ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం లో ఏఐటీయూసీ నాయకులు బి. రవి, కార్మికులు వర ప్రసాద్, వడ్డాది పోలరావు, వి. ఈశ్వరరావు, సన్యాసి రావు, జాన్సీ,అనిల్ కుమార్,జ్యోతి, బంటు. ప్రసాద్, టి. సుధీర్, కె. లక్ష్మి, నాగమణి, వర లక్ష్మి,, ఉమా, సత్యవతి పాల్గొన్నారు.//