ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి ఉషశ్రీ చరణ్ ను గెలిపించండి ----

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి ఉషశ్రీ చరణ్ ను గెలిపించండి  ----

--------- మంత్రి భర్త చరణ్ రెడ్డి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం

జనం న్యూస్ జనవరి 11 గోరంట్ల శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు గ్రామపంచాయతీ కొలింపల్లి, గుంటుపల్లి, వానవోలు తండా,ల లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి హాజరయ్యారు ఆయనతోపాటు స్థానిక నాయకులు సర్పంచ్ శ్రీరాములు, ఉపసర్పంచ్ బుల్లెట్ బాబు, వానవోలు తండా సర్పంచ్ రమణ నాయక్, ఎంపీటీసీ హరి, సింగల్ విండో అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ స్వామి, రాఘవేంద్ర స్వామి, గుంటుపల్లి ,ఈశ్వరయ్య, ఉగ్రంపల్లి శ్రీనివాసులు, ఓబుల్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి, గాజుల శ్రీనివాసులు, వెంకటేష్ నాయక్, డీలర్ మల్లికార్జున, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించారు గ్రామాలలో స్థానిక వైసీపీ నాయకులు ఆయనకు శాలువా పూలమాలలతో బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు వానవోలు లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెనుగొండ నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి ఉషశ్రీ చరణ్ గ్రామాలలో పర్యటించి నాయకుల అందరితో పరిచయాలు ఏర్పరచుకోవాలని మండలంలోని ప్రతి గ్రామానికి తిరిగి కార్యకర్తలతో సమావేశం అవ్వాలని వానవోలు గ్రామపంచాయతీలో మంత్రి ఉషశ్రీ చరణ్ తరపున ఆమె భర్త చరణ్ రెడ్డి గ్రామంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలసి అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు జగనన్న సంక్షేమ పథకాలు అందించారని మీ ఇంటి ఆడబిడ్డను ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో పెనుగొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ను గెలిపించాలని ఆయన కోరారు

కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, పట్టణ కన్వీనర్ ధనంజయ రెడ్డి ,ఎంపీపీ ప్రమీల మూర్తి, వైస్ ఎంపీపీలు నాగభూషణ్ రెడ్డి, రామలక్ష్మి సత్యనారాయణ, జడ్పిటిసి పాలే జయరాం నాయక్, సరోజా నాగేనాయక్, ఉప సర్పంచ్ రాజారెడ్డి, అగ్రి అడ్వైజరి కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ పాటూరు శంకర్ రెడ్డి, గంపల రమణారెడ్డి, నార్సింపల్లి శివారెడ్డి, పద్మనాభరెడ్డి, రఘురామిరెడ్డి ,షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫక్రోద్దీన్ చింతా రామచంద్ర రెడ్డి, మండలప్రజాప్రతినిధులు, సర్పంచులు ,ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, వైసిపి నాయకులు, వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు