ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్: మార్చి 29 నడిగూడెం 

మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  పార్టీ 42 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను  మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.శుక్రవారం  మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో   మండల పార్టీ అధ్యక్షుడు దొంతగాని శ్రీనివాస్ ఎన్టీఆర్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 42 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కేంద్రంగా బడుగు బలహీన వర్గాలకు బాసటగా స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు  పార్టీకి అంకురార్పణ చేసారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం కల్పించే లక్ష్యంతో నాడు  పెట్టిన పార్టీ నేటికీ బడుగు బలహీన వర్గాల మదిలో చెరగని ముద్రవేసిందన్నారు. పేదవారు అర్ధాకలితో అలమటిస్తున్న తరుణంలో రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదవారి ఆకలి తీర్చారన్నారు. సగం ధరకే జనతా వస్త్రాలు,అందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాలు అందించారన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పడిన పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గుండు నాగేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు షేక్ జహీర్, కార్యదర్శి దేవ రంగుల వీరన్న, పలు గ్రామాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీతయ్య, వట్టికూటి నర్సయ్య, చక్రాల పిచ్చయ్య, ఆంజనేయులు, వెంకటి, వెంకన్న, మహేష్, శ్రీను, పార్టీ కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు...