తల్లిదండ్రులను దూషిస్తే కఠిన చర్యలు తప్పవు*

తల్లిదండ్రులను దూషిస్తే కఠిన చర్యలు తప్పవు*

జనం న్యూస్ జనవరి 8 పరకాల మండలం తల్లిదండ్రులను వృద్ధులను దూషిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వృద్ధులను తల్లిదండ్రులను చేరదీసి ఆదరించాలని పరకాల సిడిపిఓ భాగ్యలక్ష్మి అన్నారు పరకాల వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ భవనంలో సోమవారం ఎడ్ల సుధాకర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సిడిపిఓ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు వయోవృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగపరుచుకో వా లని సిడిపిఓ అన్నారు సమావేశంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షులు రేపాల నరసింహ రాములు మాట్లాడుతూ సమాజములో వయోవృద్ధులు కుటుంబ పరంగా సమాజపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని అధిగమించి సుఖ జీవనం గడపాలంటే చట్టాలను సద్వినియోగ పరచుకోవాలన్నారు ఆస్పత్రిలో బస్సుల్లో రైళ్లలో బ్యాంకుల్లో ఎక్కడైనా వృద్ధులను గుర్తించి వారిని సముచితంగా గౌరవించాలన్నారు వయోవృద్ధుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల యెడల మొదట యువకులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు అనంతరం పరకాల వయోవృద్ధుల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులు రేపాల నరసింహ రాములు ఉపాధ్యక్షులు గుర్రం సదానందం పొరండ్ల కైలాసం అలీ మున్నీసా ప్రధాన కార్యదర్శి కోడెపాక సమ్మయ్య సహాయ కార్యదర్శులు బాణాల మొగిలి జంగేటి సారంగపాణి కె మహేందర్ రెడ్డి కోశాధికారి ఎడ్ల సుధాకర్ ప్రచార కార్యదర్శి సుంకరి రామన్న కార్యవర్గ సభ్యులు రాఘవరెడ్డి ఎం సంపత్ సాంబయ్య బి సారయ్య లను ఎన్నుకున్నారు సలహాదారులుగా చందుపట్ల జంగారెడ్డి ఏరుకొండ రామదాసు భూషి ప్రభాకర్ రెడ్డి దేవుని చంద్రయ్య ఎస్ శ్రీనివాసాచారి. తదితరులు పాల్గొన్నారు.....