గవరపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

గవరపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

జనం న్యూస్ జనవరి 8 (అనకాపల్లి జిల్లా)

అనకాపల్లి పట్టణం, గవరపాలెంలోని శ్రీ గౌరీ పంచాయతన దేవాలయంలో జరిగిన శ్రీ గౌరీ సేవా సంఘం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. అంతకుముందు శ్రీ గౌరీ మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సంధర్బంగా ఆలయ కమిటీ సభ్యులు అయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మళ్ళ సురేంద్ర, మళ్ళ సాంబశివరావు, ప్రెసిడెంట్ కర్రి సన్యాసి నాయుడు, సెక్రెటరీ బొడ్డేడ రామ సత్యనారాయణ, క్యాషియర్ శరగడం జగదీష్, ఆళ్ళ మహాలక్ష్మి నాయుడు, మళ్ళ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.//