నడి రోడ్డు పై గన్నుతో కేక్ ను కట్ చేసి.. ఆపై కాల్పులు జరిపి హల్చల్ చేసిన యువకుడు. ( వీడియో చూడండి)

నడి రోడ్డు పై గన్నుతో కేక్ ను కట్ చేసి.. ఆపై కాల్పులు జరిపి హల్చల్ చేసిన యువకుడు. ( వీడియో చూడండి)

జనం న్యూస్: ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే మాములుగా ఓ చిన్న ప్లాస్టిక్ కత్తితో కట్ చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తుపాకితోనే కేక్ కట్ చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 21 ఏళ్ల అనికేత్ అలియాస్ అనిష్ ఇటీవల తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వెలుగుతున్న కొవ్వత్తులను నోటితో ఊది ఆర్పేశాడు. కాని ఆ తర్వాత చేతిలో నుంచి గన్ తీసుకొని బర్త్ డే కేక్ ను కట్ చేశాడు. అనంతరం దాన్ని గాల్లోకి కూడా గురిపెట్టాడు. అలాగే టపాసులు కూడా భారీగా పేల్చారు. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఢిల్లీ పోలీసుల కంట పడింది. నెబ్ సరాయ్ లోని సంగం విహార్ ప్రాంతంలోని గన్ తో అతడు హల్ చల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చివరికి అనికేత్ ను అరెస్టు చేసి అతని నుంచి తుపాకి, రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అనికేత్ పై గతంలో కూడా ఓ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో యువతను ఆకట్టుకునేందుకే ఇలా కేక్ కట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. 

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి.

https://twitter.com/DelhiPolice/status/1642037818506743809?s=20