పెద్ద ఆవును మింగేసిన అనకొండా...! చూస్తే షాక్ అవుతారు. ( వైరల్ వీడియో చూడండి).

జనం న్యూస్: సాధారణంగా పాములు కోడిగుడ్లను లేకపోతే పాము గుడ్లను మింగేయడం లాంటివి చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు భారీ సైజు ఉన్న పాములు ఇక చిన్న సైజు ఉన్న పాములను మింగడం లాంటివి వీడియోలు కూడా సోషల్ మీడియాలోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ అనకొండ కొండచిలువ లాంటి పాములు మాత్రం ఏకంగా జంతువులనే అమాంతం మింగేస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఏకంగా మనుషులను సైతం మింగేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా కొండచిలువలు అనకొండలు ఏకంగా భారీ జంతువులను సైతం ఎంత సునాయాసంగా మింగేయటానికి సంబంధించిన వీడియోలు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చాలానే వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే నెటిజెన్స్ అందరిని కూడా షాక్ కి గురిచేస్తుంది. ఇప్పటివరకు జింకలు, మేకపిల్లలు లాంటి చిన్న సైజు జంతువులను మింగటం మాత్రమే చూశాము. కానీ ఇక్కడ ఒక పాము ఏకంగా భారీ సైజు ఉన్న ఆవును మింగేసింది. దాదాపు ఆవు టైల్ బోన్ వరకు కూడా అనకొండ నోట్లోకి వెళ్లిపోయింది అని చెప్పాలి. అయితే అంత భారీ సైజు ఉన్న ఆవునే మింగేసింది అంటే అక్కడ ఉన్న పాము ఎంత పెద్దది.. ఎంత డేంజరో ఊహించడానికి కూడా భయమేస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఈ వీడియోలో చూసుకుంటే.. అక్కడ ఉన్నది అనకొండ లేకపోతే కొండచిలువ అన్నది మాత్రం అర్థం కాని విధంగా ఉంది అని చెప్పాలి. కేవలం 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో చూసి కొంతమంది నెటిజెన్స్ ఆశ్చర్యపోతుంటే.. మరి కొంత మంది మాత్రం అదంతా ఫేక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.