150 అడుగుల విద్యుత్ స్తంభం ఎక్కి ఈ ప్రేమికులు ఎం చేస్తున్నారో చూస్తే షాక్ అవుతారు..! (వీడియో చూడండి)
జనం న్యూస్: సాధారణంగా ప్రేమికుల మధ్య గొడవలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో కొంతమంది అలిగి కొద్ది రోజుల వరకు మాట్లాడరు. కొంతమంది చేతిలో సెల్.. లేదా ఎదురుగా ఉన్న వ్యక్తి చెంప పగులగొడతారు. ఎన్ని కొడవలు జరిగినా గాని చివరికీ ప్రేమికులు కలిసిపోతారు. కామన్ గా ప్రేమికుల మధ్య జరిగే పరిస్థితి. కానీ ప్రియుడిపై అలిగి ఆమె ఏకంగా 150 అడుగుల ఎత్తైన విద్యుత్ టవర్ ఎక్కింది. ప్రియురాలు గొడవపడి తొలుత టవర్ ఎక్కగా నీ వెంటే నేను అంటూ ప్రియుడు కూడా ఆమె వెంటే టవర్ ఎక్కాడు. అరగంట తరువాత ఇద్దరూ కలిసి కిందకి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇన్సిడెంట్ ఛత్తీస్ గడ్ లోని మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. మార్వాహి జిల్లా గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన ఓ బాలిక అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ప్రేమికుల మధ్య ఫోన్ లోనే గొడవ జరిగింది. ప్రియుడితో గొడవపడిన బాలిక కోపంతో గ్రామ సమీపంలో ఉన్నటువంటి హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కింది. ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ప్రియుడు ఆమె బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. ఆమె దిగకపోవడంతో తాను కూడా ఆ టవర్ పైకి ఎక్కాల్సి వచ్చింది. దీంతో అక్కడ స్థానికులంతా గుమిగూడి వారిని కిందకి దిగమని నచ్చజెప్పారు. తమ పిల్లలు టవర్ ఎక్కిన విషయం తెలిసి ప్రేమికుల కుటుంబాలు కూడా అక్కడికీ చేరుకున్నాయి. అయినా ప్రేమికులు దిగి రాకపోవడంతో విషయం పోలీసులకు చేరింది. వెంటనే అక్కడకీ చేరుకున్న పోలీసులు.. వారికి నచ్చజెప్పి చూశారు. కొద్దిసేపు బెట్టు చేసిన ఇద్దరూ మెల్లగా టవర్ దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సురక్షితంగా కిందికి దిగిన ఆ జంటకు పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. చిన్నపిల్లలు తేలిక చేసినట్టుగా భావించి వారిని వదిలివేసినట్టు వెల్లడించారు.