వాట్సాప్ లపై ఎన్నికల సంఘం నిఘా ఉంది..అడ్మిన్ జర జాగ్రత్త

వాట్సాప్ లపై ఎన్నికల సంఘం నిఘా ఉంది..అడ్మిన్ జర జాగ్రత్త

.....రెచ్చ గొట్టే పోస్టులు వస్తే అడ్మిన్ లదే బాధ్యత

....గోరంట్ల సి ఐ సుబ్బారాయుడు సోషియల్ మీడియా నిర్వాహకులుకు సూచనలు


జనం న్యూస్ మార్చి 23:  గోరంట్ల శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజక వర్గం గోరంట్ల మండలం గోరంట్ల గోరంట్ల పోలీస్ స్టేషన్ సీఐ. ఎం .సుబ్బరాయుడు శుక్రవారం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాట్సప్ గ్రూపులలో వివాదాలకు దారి తీసే పోస్టులను పెట్టకుండా చూసుకోవాలని , ఎన్నికలవేళ సోషల్ మీడియా పై  ఎన్నికల అధికారులు నిగా పెట్టారని ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా గ్రూపులలో అసత్య ప్రచారాలు చేసిన నిబంధనలు ఉల్లంఘించి గ్రూపులలో, సోషల్ మీడియాలో పోస్ట్లు మరియు కామెంట్లు పెట్టిన వేరే గ్రూప్ నుండి ఇంకొక గ్రూప్ కి ఫార్వర్డ్ చేసిన అటువంటి వారిపైన మరియు గ్రూప్ అడ్మిన్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అలాంటి వారి పైన ఫిర్యాదు చేసిన 100 నిమిషాలలో ఎలక్షన్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు అందరూ సహకరించి ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేందుకు సహకరించాలని సిఐ . ఎం. సుబ్బరాయుడు కోరారు.