విజయనగరం ట్రాఫిక్ సిఐగా రంగనాధం

విజయనగరం ట్రాఫిక్ సిఐగా రంగనాధం

జనం న్యూస్,జనవరి 14

విజయనగరంఐదు

*విజయనగరం ట్రాఫిక్ సిఐగా పైడి రంగనాధం జనవరి 13న బాధ్యతలు చేపట్టారు. 2002 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన రంగనాథం గతంలో ఉమ్మడి జిల్లాలో ఎస్ఐగా నీలకంఠాపురం, గజపతినగరంతోపాటు పలు పోలీసు స్టేషనుల్లో సమర్థవంతంగా పని చేసి, ప్రజలు, అధికారుల నుండి మంచి గుర్తింపు పొందారు. సిఐగా ఉద్యోగోన్నతి పొందిన తరువాత అనకాపల్లి జిల్లాల్లో సీసీఎస్, సబ్బవరం పోలీసు స్టేషనులో పని చేసి, సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. సిఐగా బాధ్యతలు చేపట్టిన రంగనాధంను ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ డి.విశ్వనాథ్, ఎస్ఐలు, సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.*