అద్దంకి రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరణ

అద్దంకి రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరణ


 జనం న్యూస్   ఫిబ్రవరి 2   ( బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం )అద్దంకి రూరల్ సిఐ గా కనిగిరి నుంచి బదిలీ పై వచ్చిన శివ రామకృష్ణారెడ్డి  శుక్రవారం మెదరమెట్ల సర్కిల్ స్టేషన్ నందు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కొరిసపాడు, మేదరమెట్ల, పంగులూరు ఎస్సైలు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  సీఐ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని సిఐ శివరామకృష్ణారెడ్డి తెలియచేశారు. అక్రమ మద్యం,  జూదం వంటి వాటిపై తగు చర్యలు తీసుకుంటానని సీఐ పేర్కొన్నారు.