అమ్మాయిలతో బట్టలు విప్పించి డాన్సులు చేయించిన టీచర్... వీడియోలు రికార్డు చేసి ఆపై..?

అమ్మాయిలతో బట్టలు విప్పించి డాన్సులు చేయించిన టీచర్... వీడియోలు రికార్డు చేసి ఆపై..?

జనం న్యూస్: పాఠాలు చెప్పే కొంతమంది ఉపాధ్యాయులు గుణపాఠం చెప్పించుకునేలా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని వేధించడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే బాలికలతో అర్ధనగ్న డ్యాన్సులు వేయించాడు. బాలికలు వద్దంటున్నా వినకుండా బలవంతంగా బట్టలు విప్పించి డ్యాన్సులు వేయించాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఉపాధ్యాయుడ్ని అరెస్ట్ చేశారు. టీచర్లు సిగ్గు పడే విధంగా ప్రవర్తించిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రామ్ సింగ్ ఠాకూర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మార్చి 11న 4, 5 వ తరగతి చదువుతున్న కొందరు బాలికలతో తరగతి గదిలో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించాడు. బాలికలకు ఇష్టం లేకపోయినా సరే టీచర్ బలవంతం మీద భయపడి డ్యాన్సులు చేశారు. అయితే పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ కర్రతో కొట్టి మరీ బెదిరించాడు. అయితే ఒక బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత మరో బాల్క కూడా టీచర్ ఇలా బలవంతంగా డ్యాన్సులు వేయించాడని తన తల్లికి చెప్పడంతో వారు గ్రామస్తులకు తెలియజేశారు. టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు టీచర్ గురించి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి తెలియజేశారు. ఆమె బాలికల తల్లిదండ్రులతో కలిసి ఉపాధ్యాయుడి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్కూల్ లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేని సమయంలో బాలికలతో డ్యాన్సులు వేయించడం.. అందులోనూ అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించడంపై కారణమేంటో అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.