మందుకొట్టి నడిరోడ్డుపై మహిళ వీరంగం.. మగవాళ్ళను ఎలా కొడుతోందో ( వీడియో చూడండి).

మందుకొట్టి నడిరోడ్డుపై మహిళ వీరంగం.. మగవాళ్ళను ఎలా కొడుతోందో ( వీడియో చూడండి).

జనం న్యూస్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఆర్థికంగా కూడా నష్టపోతాం.. అన్న విషయం అందరికి తెలుసు. అయినా సరే.. మందుబాబులు మాత్రం మారరు. అందులోనూ ఒకప్పుడు మద్యపానం అంటే కేవలం మగవారు మాత్రమే అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మగాళ్లతో పోలిస్తే.. మేం దేనిలో తక్కువ.. మేం ఎందుకు మందు తాగకూడదు అని భావించే మహిళల సంఖ్య పెరుగుతోంది. పోనీ అదేదో సీక్రెట్‌గా ఇళ్లల్లో కూర్చుని మద్యం సేవిస్తున్నారా అంటే.. కాదు.. బహిరంగంగానే మందు కొడుతున్నారు. నగరాల్లో ఇలాంటి పరిస్థితులు మరీ ఎక్కువ. పోనీ తాగాక తాగాక ఊరుకుంటున్నారా! అంటే అదీ లేదు. దేశానికి తానే ప్రధాని అన్నట్లు విర్రవీతున్నారు. కనపడ్డ వారితో గొడవకు దిగుతున్నారు. అచ్చం అదే తరహాలో ఓ మహిళ నలుగురితో వాగ్వాదానికి దిగింది. మద్యం మత్తులో రోడ్డు మీద నానా రచ్చ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. పూటుగా మద్యం సేవించిన ఓ మహిళ.. రాత్రి కరీంనగర్ నుంచి గోదావరిఖనికి ఆటోలో చేరుకుంది. అందుకు డబ్బులివ్వాలని ఆటో డ్రైవర్‌ అడగగా తన వద్ద లేవని చెప్పింది. ఈ విషయమై అతడు మరోసారి గట్టిగా అడగ్గా.. అతడిపై తిట్ల దండకం మొదలుపెట్టింది. చదువుకున్న ఆవిడ కదా.. నాలుగు ముక్కలు ఇంగ్లీష్ లో తిట్టేసరికి డ్రైవరన్నకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ గొడవ చూసి పక్కనున్న వారు మహిళను ప్రశ్నించబోగా.. వారిని కూడా ఆమె దూషించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆటో డ్రైవర్లకు నచ్చజెప్పి మహిళను తిరిగి కరీంనగర్ బస్సు ఎక్కించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయనండి.

కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి.

https://twitter.com/gova3555/status/1639956504379019271?s=20