*డీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలి .*భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ)...

*డీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలి .*భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ)...

జనం న్యూస్,ఫిబ్రవరి 01 విజయనగరండీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  సిహెచ్ హరీష్, ఎన్ రుద్రప్రసాద్ లు  ప్రకటన విడుదల చేశారు.డీఎస్సీ ప్రతిపాదనని మంత్రి మండలి  ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు.అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఊరిస్తూ కేవలం 6100 పోస్టులను మాత్రమే  భర్తీ చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. 25 వేల ఉపాధ్యాయ  పోస్టులు ఖాళీగా ఉంటే 6100 పోస్టులు భర్తీ అనడం నిరుద్యోగులను మోసం చేయడమే. నాలుగు సంవత్సరాల నుంచి10 లక్షల మంది అభ్యర్థులు  నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం డిఎస్సీ అభ్యర్థుల పోస్టులకు సంఖ్యను పెంచాలని కోరారు...